wheat

Wheat | ఏడాదికి ఆరు పంటలిచ్చే గోధుమ.. డయాబెటిస్ ను కట్టడి చేసే మరో కొత్త వంగడం..

Spread the love

ఒకవైపు పెరుగుతున్న జనాభా, మరోవైపు వాతావరణ మార్పుల వల్ల వరదలు, కరువు కాటకాలు ఆహార సంక్షోభానికి దారితీస్తోంది. పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కూడా ఇందుకు మరో అవరోధంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ (డబ్ల్యూఎఫ్ పీ) అంచనాల ప్రకారం.. ప్రపంచంలో ఇప్పటికే 82.8 కోట్ల మంది ఆకలితో అల్లాడిపోతున్నారు. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది 49 దేశాల్లో కరువు పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని డబ్ల్యూఎఫ్ పీ హెచ్చరించింది. అలాగే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో ఆకలి కేకలను పెంచేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జర్మనీ పరిశోధకులు ఊహించని శుభవార్త చెప్పారు.
ఏడాదికి ఏకంగా ఆరు సార్లు పంట దిగుబడినిచ్చే ప్రత్యేక గోధుమ Wheat వంగడాన్ని రూపొందించినట్లు మ్యూనిచ్‌ వర్సిటీ పరిశోధకులు తీపి కబురు చెప్పారు. ఈ కొత్త వంగడంతో కేవలం 10 వారాల్లోనే పంట చేతికి వస్తుందని తెలిపారు. సాగునీటి వాడకం కూడా 95 శాతం వరకు తగ్గుతుందని తెలిపారు. ఈ మేరకు జర్మనీకి చెందిన సైన్స్‌ వెబ్ సైట్‌ ‘డ్యుయిష్‌ వెల్లే’ ఒక పరిశోధన పత్రాన్ని ప్రచురించింది.. ఎకరంలో ఏడాదికి 20 క్వింటాళ్ల గోధుమ పంట పండించే రైతన్న.. ఈ వంగడం సాగుచేసి ఏడాదిలో అదే ఒక్క ఎకరాలోనే 100 క్వింటాళ్లకు పైగా పండించవచ్చని పరిశోధకులు వెల్లడించారు. ఈ వంగడంతో ఆహార సంక్షోభానికి ముగింపు పలకవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

డయాబెటిస్ ను కట్టడి చేసే మరో గోధుమ

తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే గోధుమ వంగడాన్ని జర్మనీ పరిశోధకులు తీసుకొస్తే.. శరీరంలో వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించే మరో అరుదైన గోధుమ Wheat వంగడాన్ని పంజాబ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ గోధుమతో రోగ నిరోదకశక్తి పెరగడమే కాకుండా టైప్‌-2 డయాబెటిస్‌, గుండె జబ్బులు, ఊబకాయం వంటి వ్యాధులను కూడా తగ్గించే వీలు ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్,  ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.

More From Author

Ola S1 X+ Ola Electric scooter

సరికొత్త Ola S1 X+ డెలివరీలను ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్

PM Surya Ghar Muft Bijli Yojana

Solar Panels | మీ ఇంటికి సోలార్ పవర్ సిస్టమ్ పెట్టుకుంటున్నారా? అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకోండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *