Home » Solar Power Plant | 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన ప్ర‌ధాని మోదీ..

Solar Power Plant | 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన ప్ర‌ధాని మోదీ..

solar power plant
Spread the love

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ (Solar Power Plant)కు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం శంకుస్థాపన చేశారని ఎన్‌ఎల్‌సి ఇండియా లిమిటెడ్ అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ సంస్థలకు సరసమైన విద్యుత్ సరఫరాను అందించేదుకు రూ.1,756 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ చేప‌ట్టారు. ఈ సోలార్ ప్రాజెక్ట్ కోసం భారతదేశంలో తయారైన హై-ఎఫిషియెన్సీ బైఫేషియల్ PV మాడ్యూల్‌లు ఇందులో అమ‌ర్చ‌నున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఈ ప్రాజెక్టు ప‌నులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు.

NLC ఇండియా లిమిటెడ్, భారత బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మైనింగ్ కంపెనీ, న్యూ & రీజ‌న‌రేటివ్ ఫ్యూయ‌ల్ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ (CPSU) పథకంలో భాగంగా బికనేర్ జిల్లాలోని బార్సింగ్‌సర్‌లో 300 MW సౌర విద్యుత్ ప్రాజెక్టును చేప‌ట్టింది. ప్రభుత్వ సంస్థలకు సరసమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు రూ. 1,756 కోట్ల ($211.46 మిలియన్లు) పెట్టుబడితో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు.

బార్సింగ్‌సర్ ప్రాజెక్ట్ లో భారతదేశంలోనే త‌యారైన హై-ఎఫిషియన్సీ బైఫేషియల్ మాడ్యూల్స్‌ (High-efficiency bifacial PV modules)తో సహా అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంది. ఇది దాని జీవితకాలంలో సుమారు 18,000 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను త‌గ్గిస్తూ.. ఏటా 750 మిలియన్ యూనిట్ల గ్రీన్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు.ఉత్పత్తి చేయబడిన సౌర‌ విద్యుత్తు బార్సింగ్‌సర్ థర్మల్ పవర్ స్టేషన్‌లోని ముందుగా ఉన్న పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్ల ద్వారా ప్రసారం చేస్తారు.

solar power plant ప్రాజెక్ట్ కోసం విద్యుత్ వినియోగ ఒప్పందం రాజస్థాన్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్‌తో రాబోయే 25 సంవత్సరాలకు రూ. 2.52/kWh పోటీ టారిఫ్‌తో ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్ట్ సెప్టెంబరు 2024 నాటికి అందుబాటులోకి వ‌స్తుంది. ప్రాజెక్ట్ దశలో పరోక్షంగా సుమారు 600 మందికి నిర్వహణ దశలో 100 మంది సిబ్బందికి ఉపాధిని కల్పిస్తుందని అంచనా వేశారు.

ప్రధాని మోదీ ఏమన్నారంటే..?

ప్రారంభోత్సవంలో  ప్రధాని మోదీ మాట్లాడుతూ, “భారతదేశం సౌరశక్తిని ఉత్పత్తి చేయడంలో వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు.    ఈ ప్రాజెక్టులు  మరింత చౌకగా విద్యుత్‌ను అందించడమే కాకుండా యువతకు గొప్ప ఉపాధి అవకాశాలను కూడా అందిస్తాయి. ఈ ప్రాజెక్ట్ లో..  ఆత్మ నిర్భర్ భారత్ చొరవతో భారతదేశంలో తయారు చేయబడిన హై-ఎఫిషియన్సీ బైఫేషియల్ మాడ్యూల్స్‌ను వినియోగిస్తున్నారని తెలిపారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy,  Organic Farming, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే ఎలక్ట్రిక్, హైడ్రోజన్, సీఎన్ జీ వాహనాలకు సంబంధించిన  అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

2 thoughts on “Solar Power Plant | 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన ప్ర‌ధాని మోదీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *