
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో రికార్డు స్థాయిలో గోధుమల ఉత్పత్తి | Wheat production
Wheat production | 2025-26 మార్కెటింగ్ సంవత్సరానికి గోధుమల సేకరణ వేగంగా ప్రారంభమైంది, రాబోయే నెలల్లో కూడా ఇదే జోరు కొనసాగితే మొత్తం సీజన్‌కు ఇది శుభసూచకమని చెప్పవచ్చు. ఇప్పటివరకు, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో గోధుమల సేకరణ ప్రారంభమైంది, ఏప్రిల్ నుంచి పంజాబ్, హర్యానాలలో ఇది ప్రారంభమవుతుంది. మార్చి 23 వరకు మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు దాదాపు 1,45,512 టన్నుల గోధుమలను సేకరించినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో సేకరించిన 14,233 టన్నుల కంటే చాలా ఎక్కువ.2025-26 సంవత్సరానికి కేంద్రం నిర్ణయించిన MSP క్వింటాలుకు ₹2,425 కంటే అదనంగా మధ్యప్రదేశ్ క్వింటాలుకు ₹125 బోనస్ ప్రకటించింది, రాజస్థాన్ కూడా గోధుమ (Wheat) MSP కంటే క్వింటాలుకు ₹150 బోనస్ ప్రకటించింది. 2025-26 సీజన్‌లో మధ్యప్రదేశ్ దాదాపు 8 మిలియన్ టన్నుల గోధుమలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది, మొత్తం జాతీయ లక్ష్యం 31.27 మిలియన...