mXmoto M16 e-bike | భారతీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్ మరో ఎలక్ట్రిక్ బైక్ వచ్చి చేరింది. mXmoto M16 ఎలక్ట్రిక్ క్రూయిజర్, రూ. 1.98 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ అయింది. మరో ముఖ్యవిషయమేంటంటే.. కంపెనీ బ్యాటరీ ప్యాక్ పై ఏకంగా 8 సంవత్సరాల వారంటీ, మోటార్ కంట్రోలర్‌పై 3 సంవత్సరాల వారంటీని ఇస్తుంది. అదిరిపోయే స్టైల్ తో వచ్చిన ఈ బైక్ యూత్ అమితంగా ఇష్ట పడతారు. ఎంఎక్స్ మోటో ఎం16లో ఎన్నో ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎం16 బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఈ బైక్ పూర్తి మెటల్ బాడీతో వస్తుంది. mXmoto M16 బైక్ వివరాలు ఇపుడు తెలుసుకుందాం..
mXmoto M16: డిజైన్
చాలా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌ల వంటి స్ట్రీట్ నేకెడ్‌ల మాదిరిగా కాకుండా, mXmoto ఒక క్రూయిజర్ మోడల్ లో నిర్మితమైంది. ICE విభాగంలో కూడా ఈ డిజైన్ లో గట్టి పోటీనిచ్చే బైక్స్ లేవు. M16 అత్యంత దృఢమైన మెటల్ బాడీతో తయారు చేశారు. ఇది భారతీయ పరిస్థితులకు అనువైనదని కంపెనీ తెలిపింది.
mXmoto M16 మస్కులర్ ట్యాంక్, చిన్న ఫ్లైస్క్రీన్‌తో రౌండ్ హెడ్‌లైట్, క్లాసిక్ స్టెప్-అప్ డిజైన్‌తో సింగిల్-పీస్ సీటు, పెద్దదైన హ్యాండిల్ బార్, USD ఫోర్క్‌లు, డ్యూయల్ రియర్ షాక్‌లు, 17-అంగుళాల చక్రాలు, డిస్క్ బ్రేక్‌లు రెండు వైపులా ఉన్నాయి.
mXmoto M16 బైక్ లో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే 160-220కిమీల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. కేవలం మూడు గంటల్లోనే బ్యాటరీ ప్యాక్‌ను 0 నుండి 90 శాతం వరకు రీఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఇందులోని హబ్-మౌంటెడ్ మోటార్ 140Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, M16 యాక్సిలరేషన్, టాప్ స్పీడ్ వంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
రీజెనరేటివ్ బ్రేకింగ్
చాలా ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే mXmoto M16 ఎలక్ట్రిక్ బైక్ లో ఆన్‌బోర్డ్ నావిగేషన్, కాల్ నోటిఫికేషన్‌లు, మ్యూజిక్ సిస్టమ్‌తో బ్లూటూత్ కనెక్టివిటీతో TFT డిస్‌ప్లేను పొందుతుంది. మోటార్‌సైకిల్‌లో క్రూయిజ్ కంట్రోల్, పార్క్ అసిస్ట్, రివర్స్ మోడ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కూడా ఉన్నాయి. అలాగే యాంటీ స్కిడ్ అసిస్ట్, పార్కింగ్ అసిస్ట్, ఆన్-రైడ్ కాలింగ్, ఆన్-బోర్డ్ నావిగేషన్వం టి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
mXmoto M16 e-bike బైక్ డ్రైవింగ్ సామర్ధ్యాన్ని పెంచేందుకు మోటార్ కంట్రోలర్ ఇన్ పుట్ శక్తిని 16 శాతం పెంచుతుందని కంపెనీ వెల్లడించింది. 80 ఏఎంపీ హై ఎఫిషియెన్సీ కంట్రోలర్స్ రీజెనరేటివ్ బ్రేకింగ్ ఫీచర్ ను కలిగి ఉంటుందని తెలిపింది. మరిన్ని ఫీచర్ల విషయానికొస్తే ఈ ఎలక్ట్రిక్ బైక్ సెల్ఫ్-డయాగ్నోసిస్ తో వస్తుంది. సీటుకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కాంట్రాస్ట్ స్టిచింగ్ ను కూడా అందిస్తోంది. ఈ స్కూటర్ ఎల్ఈడీ డే-టైమ్ రన్నింగ్ ల్యాంపు, అడాప్టివ్ లైటింగ్, వేరియబుల్ లైట్ ఇంటెన్సిటీతో వస్తుంది. రియర్ టాప్ బాక్స్ ను ఉచిత యాక్సెసరీగా అందిస్తున్నట్లు ఎంఎక్స్ మోటో కంపెనీ తెలిపింది.
పవర్ ఫుల్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్
పవర్ ఫుల్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్ లో ఈ ఎంఎక్స్ మోటో ఎం16 బైక్ ను ప్రథమ స్థానంలో నిలపాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని ఎంఎక్స్ మోటో మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర మల్హోత్రా పేర్కొన్నారు. 2023 అక్టోబర్లో ఎంఎక్స్ మోటో కంపెనీ ఎంఎక్స్ వీ ఎకో ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ చిన్న బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ నుండి 100 కి.మీ వరకు రైడింగ్ రేంజ్ కలిగి ఉంటుంది. దీని ధర(ఎక్స్ షోరూమ్ ) రూ.84,999. అలాగే ఈ పెద్ద బ్యాటరీ ప్యాక్ 105కి.మీ నుంచి 120 కి.మీ వరకు రైడింగ్ రేంజ్ కలిగి ఉంది. అయితే దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.94,999.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Organic Farming, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
One thought on “mXmoto M16 e-bike | అదిరిపోయే స్టైల్ లో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. బ్యాటరీపై 8 ఏళ్ల వారంటీ..”