Home » Okinawa ఈవీలకు భ‌లే డిమాండ్‌

Okinawa ఈవీలకు భ‌లే డిమాండ్‌

Spread the love

Okinawa వాహ‌నాల అమ్మ‌కాల్లో వృద్ధి
Q1 FY21 లో ఒకినావా 15,000+ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్ర‌య‌యాలు

Okinawa
Okinawa

పెట్రోల్ ధ‌ర‌లు రోజురోజుకు పెరుగుతుండ‌డంతో వినియోగ‌దారులు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు మ‌ళ్లుతున్నారు. ఫ‌లితంగా మార్కెట్‌లో వీటికి భారీగా డిమాండ్ పెరిగింది. కొన్ని నెల‌ల క్రితం కేంద్ర‌ప్ర‌భుత్వం ఫేమ్‌-2 స్కీం కింద ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై స‌బ్సిడీని పెంచ‌డం కూడా ఈవీ అమ్మ‌కాల వృద్ధికి ఊత‌మిచ్చిన‌ట్ల‌యింది. అయితే Okinawa ఆటోటెక్ 2021 ఏప్రిల్, మే మరియు జూన్ నెలల్లో అమ్మ‌కాలు పెరిగిన‌ట్లు కంపెనీ పేర్కొంది. Q1 FY21 కోసం కంపెనీ తన విక్ర‌యాల‌ను వెల్ల‌డించింది. ఈ కొద్ది కాలంలోనే ఒకినావా దేశంలో 15,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. వివ‌రంగా చెప్పాలంటే ఒకినావా కంపెనీ ఏప్రిల్‌లో 4,467 యూనిట్లు, మేలో 5,649 యూనిట్లు, ఇక‌ జూన్ 2021 లో అత్యధికంగా 5,860 యూనిట్లు విక్రయించింది. ఒకినావా భారతదేశంలోని కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లో విక్ర‌యాలు చేప‌ట్టింది. బెంగళూరు, కాంచీపురం, నెల్లూరు మరియు పూణేలలో ఒకినావా వాహ‌నాలు అత్య‌ధికంగా అమ్ముడ‌య్యాయి.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Okinawa ఐప్రైస్+కు ఆద‌ర‌ణ‌

Okinawa electric scooter కంపెనీ తీసుకొచ్చిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌లో ఐప్రైస్ + ఎక్క‌వ‌గా ఆద‌ర‌ణ పొందింది. ఇది Okinawa అమ్మకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే కంపెనీ అమ్మ‌కాల విస్తరణకు కార‌ణ‌మ‌యింది. ఈ బ్రాండ్ ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా 350 కి పైగా డీలర్లను కలిగి ఉంది. మరియు కంపెనీ టైర్ -2, టైర్ -3 మరియు దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో కూడా విస్త‌రించింది. తాజా ప్రకటనపై Okinawa ఆటోటెక్ MD & ఫౌండర్ జీతేందర్ శర్మ మాట్లాడుతూ.. FAME II పథకాన్ని స‌వ‌రించిన త‌ర్వాత ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఇంధన ధరలు పెరగడంతో, ప్రజలు కూడా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారని పేర్కొన్నారు. పెట్రోల్ ద్విచక్ర వాహనాలతో పోల్చితే విద్యుత్ ద్విచక్ర వాహనాలు వాటి నిర్వ‌హ‌ణ ఖర్చులు చాలా త‌క్కువ.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

జూన్‌లో 5,860 యూనిట్ల అమ్మ‌కాలు

ఈ రెండు ప్రధాన కార‌ణాల‌తో Okinawa గత నెలలో వివిధ మోడళ్లకు సంబంధించి 5,860 స్కూటర్లను విక్రయించిందని, వాటిలో 80 శాతం హై-స్పీడ్ స్కూటర్లు అని ఎండీ జితేంద‌ర్‌శ‌ర్మ చెప్పారు. అంతేకాకుండా, ఒకినావా దేశవ్యాప్తంగా స్థానిక షోరూమ్‌లలోని వివిధ స్కూటర్ మోడళ్ల కోసం వినియోగదారుల నుండి రెట్టింపు సంఖ్య‌లో డిమాండ్ వ‌చ్చింద‌ని, వారి డిమాండ్ కు అనుగుణంగా త‌మ ఉత్ప‌త్తుల‌ను పెంచుతామ‌ని చెబుతున్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలతో తాము సంతృప్తి చెందినట్లు కంపెనీ తెలిపింది.

ఒకినావాతో పాటు హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాలైన బ‌జాజ్ చేత‌క్‌, ఏథ‌ర్, హీరో వంటి వాహ‌నాల‌కు కూడా విప‌రీత‌మైన క్రేజ్ పెరుగుతోంది.

  • Peak Power:  2500 Watt.
  • Brake System. FR- Disc | RR- Disc.
  • Seat Height. 800mm.
  • Dimensions (L X W X H) 1970X745X1165mm.
  • Loading Capacity. 150Kg.
  • Tyre. 90/90-12 Tubeless (Front/Rear)
  • Speedometer. Digital.

============================

బ్రాట్రే కంపెనీ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ స్పెసిఫికేష‌న్స్‌

 

3 thoughts on “Okinawa ఈవీలకు భ‌లే డిమాండ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *