Ola E-Scooter విడుద‌ల తేదీ ఖ‌రారు..

Spread the love

ఆగ‌స్టు 15న విడుద‌ల‌

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న Ola E-Scooter విడుద‌ల‌య్యే తేదీ ఎట్ట‌కేల‌కు ఖ‌రార‌య్యింది. అత్యాధునిక సౌక‌ర్యాల‌తో ఉన్న ఈ హై-స్పీడ్ స్కూట‌ర్‌పై ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్ ఆగష్టు 15 న లాంచ్ చేయ‌నున్న‌ట్లు కంపెనీ వ్య‌వ‌స్థాప‌కులు, సీఈవో భావిష్ అగర్వాల్ ప్ర‌క‌టించారు.

రికార్డ్ స్థాయిలో బుకింగ్స్‌..

Ola E-Scooterను ముంద‌స్తుగా రిజ‌ర్వ్ చేసుకున్న‌వారికి ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఆగస్టు 15 న ఓలా స్కూటర్ కోసం ప్రారంబోత్స‌వ‌ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ స్కూట‌ర్, విడుద‌ల తేదీలతోపాటు స్కూట‌ర్‌కు సంబంధించిన‌ పూర్తి ఫీచ‌ర్ల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఆయ‌న ట్వీట్ చేశారు.

జూలైలోనే ఓలా కంపెనీ ఈ-స్కూటర్ కోసం బుకింగ్స్‌ను ప్రారంభించింది. కానీ దాని స్పెసిఫికేషన్‌లు మరియు ధరల గురించి ఇప్పటి వరకు స్ప‌ష్ట‌త రాలేదు. గత నెలలో స్కూటర్ మొదటి 24 గంటల్లో 1 లక్ష బుకింగ్‌లను పొంది రికార్డ్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా బుక్ చేసుకున్న ఈ-స్కూటర్‌గా ఒలా ఎల‌క్ట్రిక్ నిలిచింది.

ఓలా తన ఈ-స్కూటర్‌కు సంబంధించి దాని స్పీడ్, రేంజ్, బూట్ స్పేస్ అలాగే టెక్నాలజీ పరంగా కొన్ని వివ‌రాల‌ను వెల్లడించింది. ఈ మోడల్‌ని విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు ధరను అంద‌రికీ అందుబాటులోనే ఉంటుద‌ని కంపెనీ తెలిపింది. ఇ-స్కూటర్ 10 రంగులలో ల‌భ్య‌మ‌వుతుంది. అంటూ వినియోగ‌దారుడు త‌న‌కు న‌చ్చిన రంగును ఎంచుకునేందుకు ఇక్క‌డ ఎక్కువ ఆప్ష‌న్లు ఉన్నాయి. అందులో నీలం, నలుపు, ఎరుపు, గులాబీ, పసుపు రంగులు, అలాగే తెలుపు మరియు స‌ఙ‌ళ్‌శ‌ఱ్ రంగుల్లో మాటీ ఫినిష్‌, మరియు గ్లోస్ షేడ్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

ప్ర‌పంచంలోనే భారీ ప‌రిశ్ర‌మ.. ఇండియాలోనే..

Ola E-Scooter తయారీ కోసం సంస్థ ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప‌రిశ్ర‌మ‌ను తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఏర్పాటు చే స్తోంది. 500 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. ఇక్క‌డ సంవత్సరానికి 10 మిలియన్ విద్యుత్ వాహ‌నాల‌ను ఉత్పత్తి చేస్తుందని ఓలా కంపెనీ చెప్పింది. అలాగే ఇది అత్యంత అధునాతనమైనది, 3,000 AI- ఎనేబుల్ రోబోట్‌లు, అలాగే 100 ఎకరాల్లో ప‌చ్చ‌ని మొక్క‌లు, వృక్షాల‌తో నింపుతున్నారు.

ఓలా ఎలక్ట్రిక్ సంస్థ‌ బ్యాంక్ ఆఫ్ బరోడా గత నెలలో ఫ్యాక్టరీ యొక్క ఫేజ్ -1 నిధులను మరియు ఫైనాన్షియల్ క్లోజర్ కోసం $ 100 మిలియన్ల 10 సంవత్సరాల అప్పు కోసం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఏప్రిల్‌లో కంపెనీ తన వినియోగదారులందరికీ ఛార్జింగ్ స్టేష‌న్ల‌ను అందిస్తుంది. రాబోయే ద్విచక్ర వాహనాల కోసం ఛార్జింగ్ నెట్‌వర్క్ అయిన ఓలా హైపర్‌ఛార్జర్ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించింది.

 

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..