దేశంలో అతిపెద్ద D2C ఆటోమొబైల్ రిటైల్ నెట్‌వర్క్ అవతరణ
9 ఎక్స్పీరియన్స్ సెంటర్లతో హైదరాబాద్ లో నెట్వర్క్ ను మూడింతలు విస్తరించిన ఓలా ఎలక్ట్రిక్
Ola Electric Experience Centre : భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, జమ్మూ & కాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో తన 500వ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ (EC)ని ప్రారంభించింది. తన D2C (డైరెక్ట్ టు కన్స్యూమర్) నెట్వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లను గత కొన్ని వారాలుగా చురుకుగా ప్రారంభించుకుంటూ వస్తోంది. గతేడాది పూణేలో తన మొట్టమొదటి ECని ప్రారంభించినప్పటి నుంచి కేవలం 8 నెలలలోపు దేశంలోని ఆటోమోటివ్ పరిశ్రమలో అతిపెద్ద D2C రిటైల్ నెట్‌వర్క్‌ను నిర్మించింది. దీంతో దాదాపు 300 నగరాల్లో ఓలా తన ఉనికిని కలిగి ఉంది.
కంపెనీ ఓమ్నిచానెల్ వ్యూహం, ఆఫ్‌లైన్ విస్తరణ వేగం కారణంగా, ఓలా నేడు భారతదేశంలో దాదాపు అన్ని మార్కెట్‌లను కవర్ చేస్తూ 98% మార్కెట్ రీచ్‌ను సాధించింది. ఇప్పటికే శ్రీనగర్‌లో 500వ EC ని ప్రారంభించిన ఓలా, ఇప్పుడు ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశంలో ఈ సంఖ్యను 1,000కి చేర్చాలని భావిస్తోంది.
ఓలా ఎలక్ట్రిక్ CMO అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ “భారతదేశంలో మా 500వ స్టోర్ ప్రారంభోత్సవంతో, మా డైరెక్ట్-టు-కన్స్యూమర్ (D2C) విధానం ద్వారా దేశం అంతటా విజయవంతగా విస్తరించినందుకు చాలా గర్వపడుతున్నాము. ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో స్థిరమైన భవిష్యత్తు వైపు ఈవీ మారేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మా D2C మోడల్‌తో, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో గణనీయమైన ప్రభావాన్ని సృష్టించడానికి మేము అద్భుతమైన స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు.
ఓలా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఉపయోగపడతాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఔత్సాహికులకు ఓలా యొక్క ప్రపంచ స్థాయి ఉత్పత్తులను చూసేందుకు అలాగే స్వయంగా నడిపిన అనుభవించే అందించడమే కాకుండా, కొనుగోలు, ఫైనాన్సింగ్, అమ్మకాల తర్వాత సేవలపై మార్గదర్శకత్వాన్ని ఈ సెంటర్లు అందిస్తాయి. ఓలా వాహనాలను కొనుగోలు చేసే ముందు సందర్శకులు S1, S1 ప్రో వాహనాల టెస్ట్ రైడ్ కూడా తీసుకోవచ్చు.
డోర్ స్టెప్ సేవలు
ఆటోమొబైల్ రంగంలో D2C సేల్స్ & సర్వీస్ మోడల్‌ను భారతదేశంలో తొలిసారిగా పరిచయం చేసింది ఓలా. ఇందులో భాగంగా, డోర్‌స్టెప్ డెలివరీ, సర్వీసింగ్ సేవలను కంపెనీ అందిస్తుంది. కంపెనీ ఇప్పుడు దేశవ్యాప్తంగా 500 ECలను కలిగి ఉన్నప్పటికీ, కంపెనీ విక్రయాలలో గణనీయమైన భాగం ఇప్పటికీ ఓలా వెబ్‌సైట్, యాప్‌ల నుంచే వస్తోంది. ఓలా యొక్క ఓమ్నిచానెల్ విధానం భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ వాహనాల అందుబాటుని సులభతరం చేసింది.
ఓలా ప్రస్తుతం భారతదేశ ద్విచక్ర ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో 40% వాటాని సొంతం చేసుకుంది. గత నెలలో, కంపెనీ తన అత్యధిక నెలవారీ విక్రయాలను నమోదు చేసింది, 30,000 యూనిట్లకు పైగా విక్రయించబడింది, వరుసగా ఎనిమిదో నెలలో EV 2W అమ్మకాల జాబితాలో Ola Electric అగ్రస్థానంలో నిలిచింది.
మరిన్ని అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,
టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి
👍👍👌👌