రూ.94వేలకు PURE EV ePluto 7G Pro
సింగిల్ చార్జ్ పై ఏకంగా 150కిలోమీటర్ల రేంజ్
హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ PURE EV కొత్త ఇ-స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. భారతదేశంలో PURE EV ePluto 7G ప్రొో ని రూ. 94,999, ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది. దీని కోసం బుకింగ్‌లు ఇప్పుడు అన్ని ప్యూర్ EV డీలర్‌షిప్‌లలో ప్రారంభించారు. ఈ వాహనాల డెలివరీలు మే 2023 చివరి నాటికి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.
PURE EV ePluto 7G Pro డిజైన్ ఫీచర్లు
కొత్త PURE EV ePluto 7G రెట్రో డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇది వృత్తాకార LED DRLతో రౌండ్ LED హెడ్‌ల్యాంప్ కలిగి ఉంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మూడు కలర్ వేరియంట్‌లలో అందించనుంది. అవి మాట్ బ్లాక్, గ్రే, వైట్.
బ్యాటరీ, రేంజ్
PURE EV కొత్త ePluto 7G స్కూటర్ AIS 156 సర్టిఫైడ్ 3.0 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. 1.5 kW ఎలక్ట్రిక్ మోటార్‌తో పరిగెడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంపిక చేసిన మోడ్‌ను బట్టి ఒకే ఛార్జ్‌పై 100 నుంచి 150 కిమీల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. దీనికి మూడు రైడింగ్ మోడ్‌లు ఉంటాయని కంపెనీ పేర్కొంది.
కొత్త స్కూటర్ లాంచ్‌పై PURE EV సహ వ్యవస్థాపకుడు, CEO రోహిత్ వదేరా మాట్లాడుతూ “మా అత్యధికంగా అమ్ముడవుతున్న 7G మోడల్ యొక్క ఈ అప్‌గ్రేడ్ వెర్షన్ ఆవిష్కరణ విస్తృతమైన పరిశోధన ఫలితంగా రూపొందించబడిందని తెలిపారు. ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునేవారికి ఈ మోడల్ సరిగ్గా సరిపోతుందని తెలిపారు. ప్రీ-లాంచ్ సమయంలో 5000+ ఎంక్వైరీలు అందుకున్నందుకు తాము సంతోషిస్తున్నామని, లాంచ్ అయిన మొదటి నెలలో 2000+ కంటే ఎక్కువ బుకింగ్‌లను ఆశిస్తున్నట్లు రోహిత్ తెలిపారు.
One thought on “PURE EV నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్”