Ola electric వాహ‌నాల‌పై భారీ డిస్కౌంట్

Ola electric వాహ‌నాల‌పై భారీ డిస్కౌంట్

మార్చి 31 వ‌ర‌కు ఆఫ‌ర్‌

బెంగళూరు ఆధారిత EV స్టార్టప్ అయిన Ola Electric తన ఓలా S1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌లను విడుదల చేసింది. Ola electric S1, Ola S1 Pro పై రూ.4,000 వరకు తగ్గింపు పొందవచ్చు. కంపెనీ సబ్‌స్క్రిప్షన్‌, ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీలపై ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లు మార్చి 12, 2023 వరకు చెల్లుబాటులో ఉంటాయి.

Ola electric S1, S1 Pro: డిస్కౌంట్ ఆఫర్లు
వినియోగదారులు Ola S1పై రూ. 2,000, అలాగే ఓలా S1 ప్రోపై రూ. 4,000 తగ్గింపును పొందవచ్చు. ఓలా ప్రకారం, ఇవి తమ ప్రీ-ఓన్డ్ పెట్రోల్ ద్విచక్ర వాహనాలను ఎక్స్‌చేంజ్ చేసుకుంటే గరిష్టంగా రూ. 45,000 కంటే ఎక్కువ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. కంపెనీ తన కమ్యూనిటీ సభ్యులకు Ola Care+ సబ్‌స్క్రిప్షన్‌లపై 50 శాతం తగ్గింపు ఇవ్వ‌నుంది. అలాగే ఓలా త‌న అన్ని ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ల‌లో ఎక్స్‌టెండెంట్ వారంటీలను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లన్నీ మార్చి 12, 2023 వరకు చెల్లుబాటులో ఉంటాయి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్: స్పెక్స్ మరియు ధర
Ola ఎలక్ట్రిక్ కంపెనీకి సంబంధించి ప్రస్తుతం S1 ఎయిర్, S1, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్ర‌యిస్తోంది. ఒక్కో ఛార్జీకి వరుసగా 165, 141, 181 కిమీల వరకు రైడింగ్ రేంజ్‌ను అందజేస్తాయని ఓలా పేర్కొంది. ధరల పరంగా, Ola S1 Air, S1, S1 ప్రోల ధరలు(ఎక్స్-షోరూమ్) వరుసగా రూ. 84,999, రూ. 99,999 అలాగే రూ. 1.30 లక్షల నుండి ప్రారంభ‌మ‌వుతాయి.


tech news

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు