బెంగళూరు : భారతదేశపు అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు దేశవ్యాప్తంగా Ola S1 X+ డెలివరీలను ప్రారంభించింది. ఇటీవలే లాంచ్ అయిన S1 X+ ఇప్పుడు ప్రముఖ ICE స్కూటర్ ధరతో సమానంగా కేవలం రూ.89,999 లభిస్తోంది. ఈ మోడల్ పై కంపెనీ ఏకంగా రూ.20,000 ఫ్లాట్ క్యాష్ పరిమిత సమయ తగ్గింపునిస్తున్నారు.
ఉన్నతమైన Gen 2 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన Ola S1 X+ ప్రముఖ ICE స్కూటర్‌కు సమానమైన ధరను కలిగి ఉండడం విశేషం.. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యుత్తమ పెర్ఫార్మన్స్, అధునాతన సాంకేతికతతో కూడా ఫీచర్లు, అద్భుతమైన రైడ్ నాణ్యతను అందిస్తుంది. ఈ స్కూటర్ 3kWh బ్యాటరీతో వస్తుంది. 151 కిమీల సర్టిఫైడ్ రేంజ్ ని ఇస్తుంది. సమర్థమైన 6kW మోటార్‌తో, S1 X+ కేవలం 3.3 సెకన్లలోనే 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. ఇది గంటకు 90 kmph వేగంతో ప్రయాణించగలదు.
ఓలా క్యాష్ బ్యాక్ ఆఫర్లు
కంపెనీ ‘డిసెంబర్ టు రిమెంబర్’ క్యాంపెయిన్‌లో భాగంగా, ఓలా శుక్రవారం కమ్యూనిటీ కోసం ప్రత్యేకమైన ఆఫర్‌లను కూడా ప్రకటించింది. కమ్యూనిటీ సభ్యులు అన్ని స్కూటర్‌లపై ఎక్స్టెండెడ్ వారంటీపై 50% తగ్గింపును పొందవచ్చు. ప్రతి విజయవంతమైన సిఫార్సుపై రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. S1 ప్రో జెన్-2 లేదా S1 ఎయిర్ కొనుగోలుపై రిఫరీ రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
సాధారణ స్కూటర్ల ధరలోనే..
ఓలా ఇటీవల తన S1 పోర్ట్‌ఫోలియోను ఐదు స్కూటర్లకు విస్తరించింది. S1 Pro (2వ తరం), కంపెనీ యొక్క ఫ్లాగ్‌షిప్ స్కూటర్, INR 1,47,499 వద్ద అందుబాటులో ఉంది. S1 ఎయిర్ రూ.1,19,999 ధరలో అందుబాటులో ఉంది. అదనంగా ICE-కిల్లర్ స్కూటర్ గా Ola S1 X ని మూడు వేరియంట్‌లలో ఓలా ప్రవేశపెట్టింది. అవి S1 X+, S1 X (3kWh), మరియు S1 X (2kWh). S1 X (3kWh) మరియు S1 X (2kWh) కోసం రిజర్వేషన్ విండో రూ.999 తో ఇప్పటికే ప్రారంభించింది. S1 X (3kWh) మరియు S1 X (2kWh) స్కూటర్‌లు రూ.99,999 మరియు రూ.89,999 ప్రారంభ ధరలో అందుబాటులో ఉన్నాయి.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.