35 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్

Spread the love

omega Seiki  త్రీ వీలర్ల కోసం Log9 కంపెనీ తో ఒప్పందం

లాస్ట్-మైల్ డెలివరీ కంపెనీ Omega Seiki Mobility (OSM) అలాగే Log9 Materials దేశంలోని ప్ర‌ధాన నగరాలు/పట్టణాలలో మొత్తం 10,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లను మోహరించేందుకు తమ భాగస్వామ్యాన్ని కుదుర్చ‌కున్నాయి. Rage+ Rapid Electric Three Wheelers ల‌ను విస్త‌రించ‌డానికి ఈ రెండు కంపెనీలు ఇన్‌స్టాచార్జింగ్ స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేయ‌నున్నాయి. ఈ ఇన్‌స్టాచార్జింగ్ స్టేషన్‌లు కేవలం 35 నిమిషాల్లో ఈ త్రీ-వీలర్‌ల బ్యాటరీలను చార్జ్ చేసే సామర్థ్యం క‌లిగి ఉంటాయి.

లాస్ట్-మైల్ డెలివరీ కోసం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు  ఊహించిన డిమాండ్ కారణంగా OSM,  Log9  సంస్థ‌లు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్న‌ట్లు ప్రకటించాయి. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.150 కోట్లు పెట్టుబ‌డులు పెడుతున్నాయి.
ఈ భాగస్వామ్యం గురించి ఒమేగా సీకి మొబిలిటీ వ్యవస్థాపకుడు & ఛైర్మన్ శ్రీ ఉదయ్ నారంగ్ మాట్లాడుతూ.. “Omega Seiki  (ఒమేగా సీకి) మొబిలిటీ అనేది ఎలక్ట్రిక్ OEMగా పుట్టిందని, ఇది ‘భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని బ‌లోపేతం చేయ‌డ‌మే శక్తివంతమైన‌ లక్ష్యంగా నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపారు.. ప్రస్తుతం చివరి-మైలు డెలివరీ పర్యావరణ వ్యవస్థ చాలా వేగంగా పెరుగుతోందని తెలిపారు.  న‌గ‌రాలు, చిన్న పట్టణాల్లో భారతదేశంలోని మూడింట రెండు వంతుల మంది నివసిస్తున్నందున వాహనాల ఉద్గారాల కారణంగా పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి ఆయా న‌గ‌రాల్లో అంద‌రూ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు (EV) మారడం తప్పనిసరి అని పేర్కొన్నారు. electric three-wheelers (ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్లు)  వాటి తక్కువ నిర్వహణ, నిర్వహణ ఖర్చులతో పాటు జీరో క‌ర్బ‌న ఉద్గ‌రాల కారణంగా..  ఇవి ఈ నగరాలకు వాణిజ్యపరమైన ఉపయోగం కోసం ఆర్థికంగా లాభదాయకమైన,  పర్యావరణ అనుకూలమైనవిగా నిలుస్తాయ‌ని వివ‌రించారు. Omega SeikiOmega Seiki Three Wheelers

Log9 Materials తో మా సహకారం ఈ దిశలో ఒక ప్రధాన అడుగు. వేగవంతమైన ఛార్జింగ్, మెరుగైన ఉత్పాదకత కోసం ఆధునిక సెల్ టెక్నాలజీలు, EV బ్యాటరీ సొల్యూషన్‌లో ఘ‌న చ‌రిత్ర లాగ్‌9 కంపెనీ కలిగి ఉంది. ఇది OSM Rage+ Rapid EVని భారతదేశం యొక్క అత్యంత ఇష్టపడే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌గా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని తెలిపారు.
OSM Rage+ Rapid Electric Three Wheelers

Log9 Materials  వ్యవస్థాపకుడు & CEO అక్షయ్ సింఘాల్ మాట్లాడుతూ.. టైర్ II. III నగరాలు, పట్టణాలు ప‌ర్యావ‌ర‌ణ ఉద్యమంలో చేరి, ఉద్యమానికి మరింత ఆజ్యం పోస్తే తప్ప 2030 నాటికి పూర్తిగా EV మొబిలిటీ దేశంగా మారాలనే ల‌క్ష్యం నెర‌వేద‌ర‌ని తాము న‌మ్ముతున్న‌ట్లు తెలిపారు.  Log9 అలాగే  OSM రెండు సంస్థ‌లు EV స్వీకరణకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని విశ్వసిస్తున్నామని తెలిపారు. పెట్రోల్ వాహ‌నాల‌తో పోలిస్తే EVలను స్వీకరించడం దీర్ఘకాలంలో మరింత లాభదాయకంగా ఉంటుందని అభిప్రాయ‌ప‌డ్డారు.

అందువల్ల, తుది వినియోగదారులు మరియు ఇతర వాటాదారులకు హామీ ఇవ్వబడిన శక్తి, పనితీరు మరియు మనశ్శాంతితో, Log9 మరియు OSM భారత్‌లో EV విప్లవాన్ని తీసుకురావడానికి కట్టుబడి ఉన్నాయి.

For more videos visit : Harithamithra

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..