PM Kisan Yojana | భారతదేశం వ్యవసాయ ప్రధానమైనది. నేటికీ భారతదేశ జనాభాలో 50% కంటే ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్నదాతల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇవి రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది.
భారతదేశంలో చాలా మంది రైతులు కేంద్ర వ్యవసాయ పథకాలపై అవగాహన లేక పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం 2019 సంవత్సరంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Yojana)ను ప్రారంభించింది.. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి రూ.6000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది. అయితే ఈ పథకం కింద ఇప్పటి వరకు 17 విడతలు విడుదలయ్యాయి. ఇప్పుడు 18వ విడత కోసం రైతులు వేచి చూస్తున్నారు అయితే అంతకు ముందే రైతులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోండి..
అక్టోబర్ 5న నగదు జమ
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్నదాతలకు ఏటా రూ.6000 ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే.. ప్రభుత్వం ఈ మొత్తాన్ని మూడు దఫాలుగా రైతుల బ్యంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. ఈ పథకంలో ఇప్పటివరకు 17 విడతలుగా విడుదలయ్యాయి. జూన్ నెలలో 17వ విడత జమ చేశారు. కాబట్టి ఇక 18వ విడత నగదు విడుదలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం ఇటీవలే వెల్లడించింది. వచ్చే నెల అక్టోబరు 5న 18వ విడత డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే 18వ విడత విడుదలకు ముందు రైతులు ఈ కీలకమైన పని చేయడం మరిచిపోవద్దు. లేకుంటే వారి వాయిదాల సొమ్ము బ్యాంకులో జమ కాకుండా నిలిచిపోయే అవకాశం ఉంది.
E KYC చేసుకోండి..
రైతులందరూ KYC చేసుకోవాలని భారత ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ప్రక్రియ పూర్తి కాని రైతులు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు. మీరు మీ e-KYCని కూడా పూర్తి చేయకుంటే. మీ వాయిదా నిలిచిపోవచ్చు. అందువల్ల, వీలైనంత త్వరగా ఈ-కేవైసీ పూర్తి చేయండి.
e-KYCని ఈ విధంగా పూర్తి చేయండి
మీరు ఇంట్లో కూర్చొని కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్లలో e-KYC ప్రక్రియను స్వయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇందు కోసం మీరు PM కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ కు వెళ్లండి. అప్పుడు మీరు ‘Farmers Cornerస అనే ఆప్షన్ నుఎంచుకోవాలి. దీని తర్వాత మీరు ‘e-KYC అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డు నంబర్‌ను నమోదు చేసి, ఆ తర్వాత ‘Get OTP’ పై క్లిక్ చేయండి. దీని తర్వాత, మీ ఆధార్ కార్డుకు లింక్ చేసి ఉన్న మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తర్వాత, దానిని సబ్ మిట్ చేస్తే మీ e-KYC పూర్తవుతుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..