Home » Agriculture | దేశంలో రికార్డు స్థాయిలో 3322.98 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి

Agriculture | దేశంలో రికార్డు స్థాయిలో 3322.98 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి

Agriculture News
Spread the love

Agriculture News | వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ 2023-24 సంవత్సరానికి ప్రధాన వ్యవసాయ పంటల ఉత్పత్తి తుది అంచనాలను విడుదల చేసింది. ఈ అంచనాలు ప్రాథమికంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఆధారంగా నివేదిక రూపొందించారు. రిమోట్ సెన్సింగ్, వీక్లీ క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్, ఇతర ఏజెన్సీల నుంచి అందుకున్న సమాచారంతో పంట ప్రాంతాన్ని ధ్రువీకరించి లెక్కగట్టారు. పంట దిగుబడి అంచనాలు ప్రధానంగా దేశవ్యాప్తంగా నిర్వహించే పంట కోత ప్రయోగాల (సీసీఈలు) ఆధారంగా ఉంటాయి. 2023-24 వ్యవసాయ సంవత్సరాల్లో ప్రధాన రాష్ట్రాల్లో రూపొందించిన డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే (డీజీసీఈసీఎస్) ప్రారంభించి సీసీఈలను రికార్డ్ చేసే ప్రక్రియ మళ్లీ రూపొందించారు. దిగుబడి అంచనాల పారదర్శకత, పటిష్టతను ఈ కొత్త విధానం నిర్ధారిస్తుంది.

2023-24లో దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 3322.98 ఎల్ఎంటిగా అంచనా వేశారు. ఇది 2022-23లో సాధించిన 3296.87 ఎల్ఎంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి కంటే 26.11 ఎల్ఎంటి అధికంగా ఉంది. బియ్యం, గోధుమల ఉత్పత్తి కూడా ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది.

2023-24లో మొత్తం వరి ఉత్పత్తి రికార్డు స్థాయిలో 1378.25 ఎల్ఎంటిగా అంచనా వేశారు. ఇది మునుపటి సంవత్సరం బియ్యం ఉత్పత్తి అయిన 1357.55 ఎల్ఎంటి కంటే 20.70 ఎల్ఎంటి ఎక్కువ. అలాగే 2023-24లో గోధుమ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 1132.92 ఎల్ఎంటిగా అంచనా వేయగా, ఇది మునుపటి సంవత్సరం గోధుమ ఉత్పత్తి 1105.54 ఎల్ఎంటి కంటే 27.38 ఎల్ఎంటి అధికం. అలాగే గత ఏడాది శ్రీ అన్న ఉత్పత్తి 173.21 ఎల్ఎంటి తో పోలిస్తే 175.72 ఎల్ఎంటి గా అంచనా వేశారు.

Agriculture News  2023-24లో, మహారాష్ట్రతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో కరువు వంటి పరిస్థితులు ఉన్నాయి. ఆగస్టులో ముఖ్యంగా రాజస్థాన్‌లో చాలా కాలం సరైన వర్షాలు లేవు. కరువు వల్ల తేమ ఒత్తిడి రబీ సీజన్‌పై కూడా ప్రభావం చూపింది. ఇది ప్రధానంగా పప్పుధాన్యాలు, ముతక తృణధాన్యాలు, సోయాబీన్, పత్తి ఉత్పత్తిని ప్రభావితం చేసింది.

వివిధ పంటల ఉత్పత్తి వివరాలు

  • మొత్తం ఆహారధాన్యాలు– 3322.98 ఎల్ఎంటి (రికార్డు)
  • బియ్యం -1378.25 ఎల్ఎంటి (రికార్డు)
  • గోధుమలు – 1132.92 ఎల్ఎంటి (రికార్డు)
  • పోషక, ముతక తృణధాన్యాలు – 569.36 ఎల్ఎంటి

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *