Renewable Energy : తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ

Renewable Energy
Spread the love

Clean and Green Energy Policy | హైదరాబాద్ : రానున్న పదేళ్లలో తెలంగాణ విద్యుత్ డిమాండ్ రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ (Telangana Renewable Energy)ని ప్రకటించాలని రాష్ట్ర‌ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం దీనిపై ప్రకటన చేయనున్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కాబట్టి, 2023-24లో 85,644 MUల నుంచి 2027-28 నాటికి 1,15,347 MUలకు, 2034-35 నాటికి 1,50,040 MUలకు విద్యుత్ అవసరం పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. విద్యుత్ డిమాండ్ 2023-24లో 15,623 మెగావాట్ల (MW) నుంచి 2034-35 నాటికి 31,809 మెగావాట్లకు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.

2030 నాటికి 2000 మెగావాట్ల పునరుత్పాద‌క విద్యుత్‌

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా, 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టాలని తెలంగాణ ప్ర‌భుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 31, 2020 నాటికి, తెలంగాణ మొత్తంగా 4,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో దాదాపు 3,621 మెగావాట్ల సోలార్ పవర్, 128 మెగావాట్ల పవన విద్యుత్తుతో పాటు ఇతర పునరుత్పాదక వనరులు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం, రాష్ట్రం భారీగా పునరుత్పాదక శక్తి ఉత్ప‌త్తికి అవ‌కాశం ఉంది. ఇందులో సౌర శక్తిలో 20.41 GW, పవన శక్తిలో 4.2 GW అంచనా వేశారు.

ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌పై సోలార్ ప్యానెల్స్‌

Telangana Renewable Energy : ఇటీవలి సంవత్సరాలలో తెలంగాణ దాని పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాలను చురుకుగా మెరుగుపరుస్తుంది. తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSREDCO) పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఇటీవలి కార్యక్రమాలలో వివిధ ప్రభుత్వ భవనాలు, సంస్థలలో ఆన్ గ్రిడ్-కనెక్ట్ రూఫ్‌టాప్ సోలార్ PV పవర్ ప్లాంట్‌ల ఏర్పాటు చేసింది. ఉదాహరణకు, డిసెంబర్ 2024లో, TSREDCO తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్ డిపోలు, బస్ స్టేషన్లలో సుమారు 986.09 kW రూఫ్‌టాప్ సోలార్ PV పవర్ ప్లాంట్‌ల ఏర్పాటుకు టెండర్‌ను ప్రకటించింది. కొత్త విధానం సౌర, పవన శక్తి సామర్థ్యాలను విస్తరించడానికి ఉపయోగపడుతుంది. ఈ రంగాలలో రాష్ట్ర సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వేగంగాచర్యలు చేపడుతోంది.


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *