Honda Activa EV : హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 2025ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ కంపెనీ ఇటీవల విడుదల చేసిన హోండా Activa e, హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ల బుకింగ్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. Activa e కోసం బుకింగ్‌లు ఇప్పుడు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని ఎంపిక చేసిన అధికారిక డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో, ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్‌లోని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో QC1ని రిజర్వ్ చేసుకోవచ్చు. రూ. 1,000 నామమాత్రపు బుకింగ్ రుసుముతో వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను బుక్ చేసుకోవచ్చు.
Honda Activa e వేరియంట్ ప్రత్యేకతలు ఇవే..
కొత్త హోండా Activa e పెరల్ షాలో బ్లూ, పెర్ల్ మిస్టీ వైట్, పెరల్ సెరినిటీ బ్లూ, మ్యాట్ ఫాగీ సిల్వర్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ అనే ఐదు రంగులలో లభిస్తుంది. ఇది 7-అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది హోండా రోడ్‌సింక్ డుయో యాప్ ద్వారా రియల్ టైం కనెక్టివిటీని అందిస్తుంది.
యాక్టివా ఇలో స్వాప్ చేయగల బ్యాటరీ టెక్నాలజీ ఉంటుంది. హోండా మొబైల్ పవర్ ప్యాక్ ఇ స్కూటర్ లో రిమూవబుల్ బ్యాటరీ సిస్టమ్ హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియా ద్వారా అభివృద్ధి చేయబడింది Activa e రెండు 1.5 kWh స్వాప్ చేయగల బ్యాటరీలతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 102 కిమీల రేంజ్‌ని అందిస్తుంది.
Honda QC1 : స్పెసిఫికేషన్స్
హోండా QC1 పెర్ల్ సెరినిటీ బ్లూ, పెర్ల్ మిస్టీ వైట్, మాట్ ఫాగీ సిల్వర్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెరల్ షాలో బ్లూతో సహా ఐదు రంగులలో అందుబాటులో ఉంది. QC1 మోడల్‌లో 1.5 kWh ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై 80 కిమీల రేంజ్ ని అందిస్తుంది. ఇది 4 గంటల 30 నిమిషాలలో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇక పూర్తి ఛార్జ్ 6 గంటల 50 నిమిషాలు పడుతుంది. ఇది 77 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. గంటకు 50 kmph గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. 1.5 kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 5-అంగుళాల LCD డిస్‌ప్లే, USB టైప్-C అవుట్‌లెట్, 26-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్ ఉన్నాయి.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..