Royal Enfield Himalayan Electric త్వరలో ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది..

Spread the love

Royal Enfield Himalayan Electric Concept : రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ అంటే యవతకు ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైస్పీడ్ టూ వీలర్‌ విభాగంలో రారాజుగా రాజ్యమేలుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇవి ప్రీమియం బైక్‌లుగా ప్రజాదరణ పొందుతున్నాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ల ధర ఎక్కువ అయినప్పటికీ ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా యువకులు ఈ బైక్‌ను కొనుగోలు చేసుకుంటున్నారు.

అయితే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కు సంబంధించి యూత్‌కు మరో శుభవార్త ..త్వరలో రాయల్‌ ఎన్ఫీల్డ్ బైక్ లు ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో కూడా అందుబాటులోకి రానున్నాయి. తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ బైక్ మోడల్‌ను EICMA 2023 (International Motorcycle and Accessories Exhibition) లో హిమాలయన్ 452 మోడల్ తో పాటు ఆవిష్కరించింది. కాగాఈ ఇ బైక్‌ బ్యాటరీ, రేంజ్, ఫీచర్ల గురించి మాత్రం ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

Royal Enfield Electric Himalayan ఏమిటి?

ముందుగా చెప్పినట్లుగా ఈ కొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ఆల్-ఎలక్ట్రిక్.. డిజైన్ కొత్త హిమాలయన్ 452 మోడల్ మాదిరిగానే ఉంది. ఇది సొగసైన స్టైలింగ్‌తో వస్తుంది. ఇది పెద్ద విండ్‌స్క్రీన్‌తో కూడిన సర్కిల్ , ఫుల్-LED హెడ్‌ల్యాంప్, సింగిల్-పీస్ సీటు అది కూడా ఫ్యూయల్ ట్యాంక్ వంటిది కనిపించకుండా పూర్తిగా ఆక్రమించి ఉంది. సీటు కింద ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. ఈ కాన్సెప్ట్ ముందు భాగంలో చంకీ అప్‌సైడ్-డౌన్ ఫోర్క్‌లతో అమర్చబడి ఉంటుంది. ఇది అడ్జస్టబుల్ రియర్ షాక్ లాగా కనిపిస్తుంది. మొత్తానికి రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకారం, ఎలక్ట్రిక్ హిమాలయన్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ప్రయోజనాలతో కూడిన అడ్వెంచర్ బైక్ ఫీచర్లను కలిగి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ కోసం మన వాట్సప్ చానల్ లో చేరండి

ఎలక్ట్రిక్ హిమాలయన్ రాయల్ ఎన్ఫీల్డ్  భవిష్యత్తు ఉత్పత్తులకు సంబంధించిన బ్లూప్రింట్ ఇది. అందువల్ల ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ స్టేబుల్ నుంచి ఏమి రావాలి అనేదానికి ఇధి ఒక ఐడియాను ఇస్తుంది.

royal enfield himalayan electric

రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ హిమాలయన్: హార్డ్‌వేర్

నివేదికల ప్రకారం, ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్,  స్టార్క్ ఫ్యూచర్ రెండూ నిర్మించాయి. గత సంవత్సరం స్పానిష్ కంపెనీలో 50 మిలియన్ యూరోలు పెట్టుబడి పెట్టారు. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రకారం, డిజైన్ బృందం అంతర్గతంగా రూపొందించిన బ్యాటరీ, ఆర్కిటెక్చర్‌పై దృష్టి సారించి కాంపోజిట్ బాడీవర్క్ కోసం ఆర్గానిక్ ఫ్లాక్స్ ఫైబర్ వంటి పదార్థాలను ఉపయోగించింది.

ఈ బైక్‌లో ఫ్రంట్ ఆఫ్-సైడ్ డౌన్ ఫోర్క్స్, రియర్‌ అడ్జస్టబుల్‌ షాక్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. ప్రస్తుతం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ ఎలక్ట్రిక్ బైక్‌ ప్రస్తుతం తయారీ దశలో ఉంది. దీనికి మరెన్నో టెస్టులు చేయాల్సి ఉన్నందున రోడ్లపైకి రావడానికి ఇంకా సమయం పట్టనుంది. నివేదికల ప్రకారం ఈ బైక్‌ 2025 లో విడుదల కానున్న్లట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ప్రపంచ మార్కెట్‌లో విడుదలైన హిమాలయన్ 452 అడ్వెంచర్ బైక్ బుకింగ్ నవంబర్ 7 నుంచి ప్రారంభమైంది. ఈ హిమాలయన్ 452 అడ్వెంచర్ బైక్‌ను చాలా అత్యాధునికంగా రూపొందించారు. లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తున్న మొట్టమొదటి రాయల్‌ ఎన్‌పీల్డ్‌ మోటార్‌సైకిల్ ఇది.. ఇందులో పూర్తి డిజిటల్ TFT ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను పొందుపరిచారు.

హిమాలయన్‌ 452 అడ్వెంచర్‌ బైక్‌లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ.. స్విచ్ యాక్సెసబుల్‌ ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 21/17-అంగుళాల స్పోక్ వీల్ ఉంటుంది. తొలిసారిగా హిమాలయన్‌ 452 మోటార్‌ సైకిల్‌ వేర్వేరు రైడింగ్‌ మోడ్‌ల తో వస్తోంది. ఇవి ఎకో, ఫర్మామెన్స్‌ Rear ABS ON, ఫర్మామెన్స్‌ (Rear ABS Off) మోడ్‌లుగా ఉన్నాయి.. రైడ్‌ బై రైడ్‌, స్విచ్‌బుల్‌ ABSను కలిగి ఉంటుంది.

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..