అదిరే లుక్ తో Svitch CSR 762 Electric Bike

Spread the love

విడుదలకు సిద్ధమైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్

వర్ధమాన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ స్విచ్ మోటోకార్ప్ (Svitch Motocorp), భారత మార్కెట్‌లో స‌రికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను (electric motorcycle) విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. ఈ ఎల‌క్ట్రిక్ బైక్‌ను CSR 762 అని పిలుస్తారు. ఇది ఈ సంవత్సరం జూలై-ఆగస్టు నాటికి ప్రారంభించనున్న‌ట్లు తెలుస్తోంది. CSR 762 ఎల‌క్ట్రిక్ బైక్‌లో శక్తివంతమైన 3 kW ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ సెంట్రల్ డ్రైవ్ సిస్టమ్‌తో వ‌స్తుంది. ఇందులో 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమ‌ర్చారు.

Svitch CSR 762 Specifications

ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ గరిష్టంగా 110 kmph వేగంతో దూసుకెళ్తుంది. ఒక్క‌సారి చార్జి చేస్తే 120 km రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఇతర స్పెసిఫికేషన్ల విష‌యానికొస్తే..  వీల్‌బేస్ 1,430 మిమీ,  బ‌రువు 155 కిలోలు ఉంటుంది. సీటు ఎత్తు 780 మిల్లీమీటర్ల ఉంటుంది. ఇది భారతీయ ప్రజలకు అందుబాటులో ఉండే మోటార్‌సైకిల్‌గా ఉంటుంద‌ని కంపెనీ పేర్కొంది. ఇందులో 6 రైడింగ్ మోడ్‌లు ఉంటాయి.

svitch csr 762

CSR 762 లాంఛ్ గురించి స్విచ్ మోటోకార్ప్ వ్యవస్థాపకుడు  రాజ్‌కుమార్ పటేల్ మాట్లాడుతూ..  “ ఎలక్ట్రిక్ మార్పుతో భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని పునరుద్ధరించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.  ఖచ్చితత్వం, నాణ్యతలో. CSR 762 ఎల‌క్ట్రిక్‌ బైక్ చ‌క్క‌ని ఆన్-రోడ్ రైడింగ్ అనుభవం ఇస్తుంద‌ని పేర్కొన్నారు. ఇది సామాన్యులకు నిజంగా విలాసవంతమైనది అనే బలమైన భావనను అందిస్తుంద‌న్నారు.
CSR 762 ధర దాదాపు రూ. 1.65 లక్షలు (సబ్సిడీలు మినహాయించి) ఉంటుంద‌ని తెలుస్తోంది.

Ultraviolet, Quanta, pure ev eCrist,

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..