
Kharif Crop | రానున్న ఖరీఫ్‌లో ‘ఎల్ నినో’ ముప్పు
మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సన్న రకాలకే ప్రాధాన్యంపప్పుధాన్యాలు, నూనెగింజల సాగు పెంచడమే లక్ష్యంఏకపంట విధానం వద్దు - భూసారాన్ని కాపాడుకుందాంఅధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షKharif Crop Planning : రానున్న ఖరీఫ్ సీజన్‌లో వర్షపాత పరిస్థితులు, సాగు ప్రణాళికపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాబోయే సీజన్‌లో 'ఎల్ నినో' ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో, రైతులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.మే 15లోగా సమగ్ర నివేదికవాతావరణ శాఖ నుండి మే 15వ తేదీ నాటికి పూర్తి స్థాయి నివేదికను తెప్పించుకోవాలని మంత్రి సూచించారు. వాతావరణ అంచనాలు మరియు ఆయా జిల్లాల వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా జిల్లా వారీ సాగు ప్రణాళికలను (District-wise Crop Plans) సిద్ధం చే...

