
Hydrogen Fuel Train : మన హైడ్రోజన్ రైళ్లు ప్రపంచంలోనే ఎందుకు ప్రత్యేకమైనవి?
Green Hydrogen : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఇంధనం (Hydrogen Fuel Train)తో నడిచే రైలు ఇంజిన్‌ను అభివృద్ధి చేయడంతో భారతీయ రైల్వే ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. మన హైడ్రోజన్ రైళ్లు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారై అసాధారణమైన హార్స్‌పవర్ అవుట్‌పుట్ ను అందిస్తాయని, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఇటీవల ప్రకటించారు.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగు దేశాలు మాత్రమే హైడ్రోజన్-శక్తి (Hydrogen Energy) తో కూడిన రైళ్లను విజయవంతంగా తయారు చేశాయి. వీటి ఇంజిన్లు 500 నుంచి 600 హార్స్‌పవర్ రేంజ్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనికి పూర్తి విరుద్ధంగా, ఇండియన్ రైల్వేస్ తయారు చేసిన హైడ్రోజన్ ఇంజన్ సాటిలేని విధంగా 1,200 హార్స్‌పవర్‌ను అందిస్తుంది, ఈ కేటగిరీలో ఇదే అత్యంత శక్తివంతమైనది. ఈ సాంకేతిక పురోగతి స్థిరమైన ఆవిష్కరణలకు భారతదేశం నిబద్ధతను ప్రపంచ ప్రమాణాలను అధిగ...