దృఢమైన మెటల్ ప్యానెల్‌తో Battre Storie electric scooter
జైపూర్‌కు చెందిన EV స్టార్టప్, బాట్రే (Battre) విడుదల చేసిన Battre Storie electric scooter మిగతా వాహనాల కంటే భిన్నంగా మెటల్ ప్యానెల్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఇది Ather 450X, Ola S1 Pro, TVS iQube, బజాజ్ చేతక్ వంటి ఇతర ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు భిన్నంగా మెటల్ బాడీతో రూపొందించడం దీని ప్రత్యేకత.
Battre Storie electric scooter స్పెసిఫికేషన్లు
Battre Storie క్లాసిక్ స్కూటర్ వంటి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఫాలో-మీ-హోమ్ ల్యాంప్స్ ఫీచర్‌తో LED లైటింగ్ ఉంటుంది. బాడీ ప్యానెల్‌లు పూర్తిగా మెటల్‌తో రూపొందించడం దీని ప్రత్యేకత.ఇందులో 2kW గరిష్ట పవర్ అవుట్‌పుట్‌ను కలిగి ఉన్న Lucas TVS సోర్స్డ్ మోటార్‌ను అమర్చారు. ఇది 3.1kWh బ్యాటరీ ప్యాక్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూ...