Home » దృఢ‌మైన మెట‌ల్ ప్యానెల్‌తో Battre Storie electric scooter

దృఢ‌మైన మెట‌ల్ ప్యానెల్‌తో Battre Storie electric scooter

Battre Storie electric scooter
Spread the love

జైపూర్‌కు చెందిన EV స్టార్టప్, బాట్రే (Battre) విడుద‌ల చేసిన Battre Storie electric scooter మిగ‌తా వాహ‌నాల కంటే భిన్నంగా మెట‌ల్ ప్యానెల్‌తో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం అనేక ఫీచర్లను క‌లిగి ఉంది. ఇది Ather 450X, Ola S1 Pro, TVS iQube, బజాజ్ చేతక్ వంటి ఇతర ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు భిన్నంగా మెట‌ల్ బాడీతో రూపొందించ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.

Battre Storie electric scooter స్పెసిఫికేషన్లు

Battre Storie క్లాసిక్ స్కూటర్ వంటి డిజైన్ క‌లిగి ఆధునిక ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఫాలో-మీ-హోమ్ ల్యాంప్స్ ఫీచర్‌తో LED లైటింగ్ ఉంటుంది. బాడీ ప్యానెల్‌లు పూర్తిగా మెటల్‌తో రూపొందించ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.

ఇందులో 2kW గరిష్ట పవర్ అవుట్‌పుట్‌ను కలిగి ఉన్న Lucas TVS సోర్స్డ్ మోటార్‌ను అమ‌ర్చారు. ఇది 3.1kWh బ్యాటరీ ప్యాక్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ స్థానికంగానే త‌యారు చేసిన‌ట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ ను 1 లక్ష కిలోమీటర్లకు పైగా పరీక్షించబడింది

ఎన్నో స్మార్ట్ ఫీచ‌ర్లు

ఇతర ఫీచ‌ర్ల విష‌యానికొస్తే ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్‌లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్, డిస్టెన్స్-టు-ఎంప్టీ డిస్‌ప్లే, స్పాటిఫై కంపాటిబిలిటీ వంటి ఇండికేష‌న్లు వాహనంపై 5ఇంచ్ TFT డ్యాష్‌బోర్డ్ పై క‌నిపిస్తాయి. స్టోరీ మూడు రైడింగ్ మోడ్‌లను క‌లిగి ఉంది. అవి ఎకో, కంఫర్ట్, స్పోర్ట్. అదనంగా, రివర్స్ పార్కింగ్ మోడ్‌లు కూడా ఇందులో పొందుప‌రిచారు.

సింగిల్ చార్జిపై 132కిమి రేంజ్

బాట్రే స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 132కిలోమీట‌ర్ల వ‌రకు ప్ర‌యాణించ‌గ‌ల‌దు. గంట‌కు 60కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఐదు గంట‌ల్లో బ్యాట‌రీ పూర్తిగా చార్జ్ అవుతుంది. బాట్రే స్టోరీ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఎక్స్‌షోరూం ధరను రూ. 89,600 గా నిర్ణయించబడింది. మరియు ప్రస్తుతానికి ఒకే వేరియంట్ అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి, బాట్రే స్టోరీని కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అలాగే స్థానిక షోరూమ్‌లలోనూ అందుబాటులో ఉంది. నేరుగా షోరూం వ‌ద్ద‌ టెస్ట్ రైడ్ చేసుకుని కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates