
Electric 2-wheeler Sales | ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల్లో ఫిబ్రవరిలో విజేత ఎవరు?
Electric 2-wheeler Sales | 2024 లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29 ముగిసే వరకు ఆర్థిక సంవత్సరంలో మొదటి 11 నెలలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రిటైల్ అమ్మకాలు 800,000 యూనిట్లను అధిగమించాయి. భారత ప్రభుత్వ వాహన్ వెబ్‌సైట్ లో రిటైల్ అమ్మకాల డేటా ప్రకారం, ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (OEMలు) కలిసి ఫిబ్రవరి 2024లో మొత్తం 81,963 యూనిట్లను విక్రయించారు, జనవరి 2024లో కంటే కేవలం 36 యూనిట్లు (81,927 యూనిట్లు) అధిగమించారు. దాదాపు 170 ఈవీ కంపెనీల్లో ఓలా ఎలక్ట్రిక్, TVS మోటార్ కో, అథర్ ఎనర్జీ, బజాజ్ ఆటో, గ్రీవ్స్ ఎలక్ట్రిక్-ఆంపియర్ వెహికల్స్‌తో సహా ఆరు OEMలు మార్కెట్ లీడర్‌లుగా నిలిచాయి.
1. OLA Electric (ఓలా ఎలక్ట్రిక్)
ఎప్పటిలాగే ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఓలా స్కూటర్లపై భారీగా డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తుండడంతో ఓలా ఎలక్ట్రిక్ గత నెలలో రికార్డు స్థాయిలో 33,...