
Delhi News | ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో నగరానికి 1000 ఎలక్ట్రిక్ బస్సులు
Delhi News : వచ్చే నెల నుంచి ఢిల్లీ రోడ్లపైకి మరో 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) రానున్నాయి. దీని కోసం ఢిల్లీ ప్రభుత్వం సన్నాహాలను ఇప్పటికే ప్రారంభించింది. రాష్ట్ర రవాణా మంత్రి పంకజ్ సింగ్ (Minister Pankaj singh) మాట్లాడుతూ ఈ బస్సులు ఏప్రిల్ నుంచి రావడం ప్రారంభిస్తాయని చెప్పారు. ఢిల్లీ (Delhi) ని భారతదేశానికి ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రాజధానిగా మార్చడమే మా లక్ష్యం. 2027 నాటికి రాజధానిలోని అన్ని బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని సాధించడానికి, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, ఆధునిక రవాణా సాంకేతికతలపై కసరత్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.బస్సుల జీవితకాలం ముగియబోతోంది.వాస్తవానికి, అనేక DTC బస్సుల జీవితకాలం మార్చి 31 నుంచి ముగుస్తోంది. దీని కారణంగా బస్సుల కొరత ఏర్పడవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ ప్రభుత్...