రూ.800కోట్లతో 7000 BPCL EV charging stations
ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను కలిపేలా ఈవీ చార్జింగ్ కారిడార్లు
BPCL EV charging stations : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), ‘మహారత్న’ అలాగే ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ సంయుక్తంగా కర్ణాటక, కేరళ, తమిళనాడులోని 15 హైవేల వెంట 110 ఫ్యూయల్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ వెహికల్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ (electric vehicle fast charging stations) లను ప్రారంభించింది.
కేరళలో 19 పెట్రోల్ స్టేషన్లతో 3 కారిడార్లు, కర్ణాటకలో 33 ఇంధన కేంద్రాలతో 6 కారిడార్లు, తమిళనాడులో 58 ఇంధన కేంద్రాలతో 10 కారిడార్‌లను కంపెనీ ప్రారంభించింది. వాస్తవానికి రాబోయే 2 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 7,000 EV ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి సుమారు రూ. 800 కోట్ల పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలను రూపొందించింది.ఒక EVని ఛార్జ్ చేయడానికి కేవలం 30 నిమిషాలు పడుతుందని, 30 KW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 125 కిమీల పరిధిని...