Home » రూ.800కోట్ల‌తో 7000 BPCL EV charging stations

రూ.800కోట్ల‌తో 7000 BPCL EV charging stations

BPCL EV charging stations
Spread the love

ప్ర‌ముఖ ఆధ్యాత్మిక‌, ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను క‌లిపేలా ఈవీ చార్జింగ్ కారిడార్లు

BPCL EV charging stations : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), ‘మహారత్న’ అలాగే ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ సంయుక్తంగా కర్ణాటక, కేరళ,  తమిళనాడులోని 15 హైవేల వెంట 110 ఫ్యూయ‌ల్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ వెహికల్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ (electric vehicle fast charging stations) లను ప్రారంభించింది.
కేరళలో 19 పెట్రోల్ స్టేష‌న్ల‌తో 3 కారిడార్లు, కర్ణాటకలో 33 ఇంధన కేంద్రాలతో 6 కారిడార్లు, తమిళనాడులో 58 ఇంధన కేంద్రాలతో 10 కారిడార్‌లను కంపెనీ ప్రారంభించింది. వాస్తవానికి రాబోయే 2 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 7,000 EV ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి సుమారు రూ. 800 కోట్ల పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలను రూపొందించింది.

ఒక EVని ఛార్జ్ చేయడానికి కేవలం 30 నిమిషాలు పడుతుందని, 30 KW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 125 కిమీల పరిధిని అందిస్తుంది. మూడు రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన BPCL EV కారిడార్‌లో రెండు ఫాస్ట్ ఛార్జర్‌ల మధ్య దూరం 100కిమీ కంటే తక్కువగా ఉంటుంది.
ఈ కారిడార్లు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్ వంటి ముఖ్యమైన ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల నగరాలతో కలుపుతాయి. ఇందులో ముఖ్యంగా రణగంఠస్వామి దేవాలయం, జంబుకేశ్వరాలయం. కేరళలో ఉన్న ప్రసిద్ధ ధార్మిక ప్రదేశాలు గురువాయూర్ దేవాలయం, కడంపుజ దేవాలయం, National shrine of Basilica, St.Antony’s Church (సెయింట్ ఆంటోనీస్ చర్చి), కొరట్టి, మర్కజ్ నాలెడ్జ్ సిటీ & తమిళనాడులోని కన్యాకుమారిలోని ఎర్లీ సన్‌రైజ్ వాచ్, మధురైలోని మీనాక్షి అమ్మన్ టెంపుల్ వంటి ప్రాంతాలు మరెన్నో ఉన్నాయి. BPCL EV charging stations

ఇప్పటి వరకు Bharat Petroleum Corporation (BPCL) 21 హైవేలను ఎలక్ట్రిక్ కారిడార్‌లుగా మార్చింది. మార్చి 2023 నాటికి, దేశంలో EV వృద్ధికి మద్దతు ఇవ్వడానికి వేగవంతం చేయడానికి 200 హైవేలు ఎలక్ట్రిక్ వెహికల్ ఫాస్ట్ ఛార్జర్‌లతో క‌వ‌ర్ చేయ‌బ‌డ్డాయి.
ఈ ఫాస్ట్ EV ఛార్జింగ్ కారిడార్‌లను పి.ఎస్. రవి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంచార్జి (రిటైల్) పుష్ప్ కుమార్ నాయర్, హెడ్ రిటైల్ సౌత్, కన్నబిరన్ డి., స్టేట్ హెడ్ (రిటైల్) కేరళ, శుభంకర్ సేన్, చీఫ్ జనరల్ మేనేజర్ (రిటైల్ ఇనిషియేటివ్ & బ్రాండ్) కేరళలోని ఎర్నాకులంలో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రారంభించారు.


tech news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *