
Black Diamond Apples | అత్యంత అరుదైన బ్లాక్ యాపిల్స్.. ధర తెలిస్తే అవాక్కవుతారు
Black Diamond Apples | ఆరోగ్యరక్షణకు యాపిల్స్ (Apples ).. ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజుకో యాపిల్ తినాలని.. వీటిని తినటం వల్ల వై ద్యుడి అవసరమే ఉండదని చెబుతారు. ఈ యాపిల్స్ లో విటమిన్లు, ఫైబర్, ఇతర పోషకాలు విరివిగా ఉంటాయి. వీటిని సలాడ్స్‌లో, డెజర్ట్‌గానూ, జూస్ లు చేసుకొని సేవించవచ్చు. అయితే, మనం ఇప్పటివరకూ రెడ్ యాపిల్స్, గ్రీన్ యాపిల్స్‌ను మాత్రమే చూసి ఉన్నాం. మార్కెట్లలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తుంటాయి. కానీ బ్లాక్ యాపిల్స్ కూడా ఉంటాయని మీకు తెలుసా..? ఎప్పుడైనా చూశారా..? అయితే ఒకసారి ఈ కథనం చదవండి..
నలుపు రంగులో కనిపించే ఈ యాపిల్స్ అత్యంత ఖరీదైనవి.. మొత్తం యాపిల్ జాతుల్లోనే ఈ పండు అత్యంత స్పెషల్.. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.. అలాగే ఎన్నో వ్యాధులను కూడా నయం చేసే గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇవి కేవలం చైనా, టిబెట...