Harithamithra Telugu News

Home Health And Lifestyle Black Diamond Apples | అత్యంత అరుదైన బ్లాక్‌ యాపిల్స్‌.. ధర తెలిస్తే అవాక్కవుతారు

Black Diamond Apples | అత్యంత అరుదైన బ్లాక్‌ యాపిల్స్‌.. ధర తెలిస్తే అవాక్కవుతారు

0
Black Diamond Apples

Black Diamond Apples | ఆరోగ్యరక్షణకు యాపిల్స్ (Apples )‌.. ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్స్‌ పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజుకో యాపిల్‌ తినాలని.. వీటిని తినటం వల్ల వై ద్యుడి‌ అవసరమే ఉండదని చెబుతారు. ఈ యాపిల్స్ లో విటమిన్లు, ఫైబర్‌, ఇతర పోషకాలు విరివిగా ఉంటాయి. వీటిని సలాడ్స్‌లో, డెజర్ట్‌గానూ, జూస్ లు చేసుకొని సేవించవచ్చు. అయితే, మనం ఇప్పటివరకూ రెడ్‌ యాపిల్స్‌‌, గ్రీన్‌ యాపిల్స్‌ను మాత్రమే చూసి ఉన్నాం. మార్కెట్లలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తుంటాయి. కానీ బ్లాక్‌ యాపిల్స్‌ కూడా ఉంటాయని మీకు తెలుసా..? ఎప్పుడైనా చూశారా..? అయితే ఒకసారి ఈ కథనం చదవండి..
నలుపు రంగులో కనిపించే ఈ యాపిల్స్‌ అత్యంత ఖరీదైనవి.. మొత్తం యాపిల్‌ జాతుల్లోనే ఈ పండు అత్యంత స్పెషల్.. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.. అలాగే ఎన్నో వ్యాధులను కూడా నయం చేసే గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇవి కేవలం చైనా, టిబెట్‌లోని పర్వత ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. వీటిని ‘బ్లాక్‌ డైమండ్‌ యాపిల్స్‌‌’ (Black Diamond Apples) అని కూడా పిలుస్తారు.. పైన నల్లగా ఉన్నా.. లోపల మాత్రం సాధారణ యాపిల్‌ మాదిరిగానే తెల్లగా ఉంటుంది. ఈ పండును చూడగానే తినేయాలి అనిపించేలా నిగనిగలాడుతూ ఉంటుంది.
Black Diamond Apple Price : దీని ధర విషయానికి వస్తే ఒక్కో పండు రూ.500 వరకు ఉంటుంది. ఈ ఆపిల్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ‌.. సాధారణంగా యాపిల్‌ చెట్లు రెండు మూడేళ్లలోనే కాపు మొదలు పెడతాయి. కానీ బ్లాక్‌ యాపిల్‌ తొలి పంట చేతికి అందడానికే కనీసం 8 సంవత్సరాల సమయం పడుతుందట.. ఇంతటి ప్రత్యేకతలు (Unique Variety) కలిగిన ఈ బ్లాక్‌ డైమండ్‌ ఆపిల్స్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి..


Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Previous articleసింగిల్ చార్జిపై 333 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. తుది పరీక్షల్లో బ్రిక్స్ ఎలక్ట్రిక్ ప్రొటోటైప్..
Next articlelectrix ECity : చూడ్డానికి సింపుల్ మోపెడ్.. కానీ దీంతో రూ.12 ఖర్చుతో 100 కి.మీ వెళ్లొచ్చు..
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here