Electric Vehicles మంటల్లో ఎందుకు చిక్కుకుంటున్నాయి.. ?
EVలను బ్యాటరీలను సురక్షితంగా ఎలా ఉంచాలి?
గత కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్ వాహనాలు మంటల్లో చిక్కుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న వేళ వాహనదారులు ఈవీల వైపు చూస్తున్నారు. భారతదేశంలో మొబిలిటీ భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలేనని అనుకుంటున్న తరుణంలో వరుస అగ్నిప్రమాదాలు అందరినీ కలవర పెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు అగ్ని ప్రమాదాలకు గురయ్యాయి. (Electric vehicle battery safety standards)EVలకు మంటలు అంటుకుంటున్న సంఘటనలు కొన్నేళ్లుగా నమోదవుతున్నప్పటికీ.. ఓలా, ఒకినావా, ప్యూర్ ఈవీ, వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఈవీలు కూడా కాలిపోవడం ఆందోళన కలిగిస్తోంది.ఓలా ఎలక్ట్రిక్ విడుదల చేసిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 మార్కెట్‌లో ప్రభంజనమే సృష్టించింది. అయితే పూణెలో ఒక చోట పార్క్ చేసిన ఓలా ఎస్1 ప్రో ఎల...