Vanamahotsavam-2024 | ఎక్కువ మొక్కలు నాటిన వారికి ఇకపై అవార్డులు..
VIJAYAWADA : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం కోటి మొక్కలను నాటి సంరక్షిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. వన మహోత్సవాన్ని (Vanamahotsavam-2024) పురస్కరించుకుని మంగళగిరిలోని ఎకో పార్కులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కలు నాటారు. ఏపీకి 50% పచ్చదనం అందించాలనే లక్ష్యంతో మొక్కలు నాటాలని, అదే సమయంలో ఉన్న చెట్లను సైతం కాపాడడం మరిచిపోవద్దని ప్రజలకు సూచించారు. హరితాంధ్ర కోసం పాటుపడదాం,…