Electric Scooter Buying Guide : బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా గుర్తించాలి? కొనేముందు విషయాలను అస్సలు మర్చిపోవద్దు..
Electric Scooter Buying Guide : ప్రస్తుతం భారతదేశంలో ఈవీ మార్కెట్లో లెక్కలేనన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. హీరో, బజాజ్ వంటి పాపులర్ బ్రాండ్‌లతో పాటు ఓలా, ఏథర్ వంటి ఎన్నో స్టార్టప్‌ల నుంచి అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈవీలు వచ్చాయి. అయితే, ఏ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలో నిర్ణయించుకోలేక చాలా మంది కొనుగోలుదారులు సతమతమవుతుంటారు. అయితే ఈ కథనం ద్వారా మీరు ఈవీ కొనుగోలు సమయంలో చూడాల్సిన పలు అంశాలపై ఓ అంచనాకు రావచ్చు. భారతదేశంలో ఇ-స్కూటర్‌ను కొనుగోలు చేసే ముందు మీరు చెక్ చేయాల్సిన పాయింట్లు ఒకసారి చూడండి..
1. ధర
ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసే అన్నింటి కన్నా ముందు చూడాల్సిన అత్యంత కీలకమైన విషయం ధర.. బ్యాటరీ సాంకేతికత ఇప్పటికీ చాలా ఖరీదైనది. ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా అంతే.. భారతదేశంలో అందుబాటులో ఉన్న కొన్ని అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌ల ధర రూ. 1 లక్ష కంటే ఎక్కువగా ఉన్నా...