ఇండియాలో EV రంగానిదే ఉజ్వల భవిష్యత్తు
India’s electric vehicle sector : వచ్చే 25 ఏళ్లలో ఇంధన రంగంలో స్వయం ప్రతిపత్తిని సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని, దానిని సాధించడంలో “నిశ్శబ్ద విప్లవం”కి నాయకత్వం వహిస్తున్న ఎలక్ట్రిక్ వాహనం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇంధన వినియోగంలో ఎక్కువ భాగం రవాణా రంగంలో ఉన్నందున, ఈ రంగంలో ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని అన్నారు. భారత్‌లో సుజుకి మోటార్‌కు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ “రాబోయే 25 ఏళ్ల అమృత్‌కాల్‌లో భారతదేశం తన ఇంధన అవసరాల కోసం ఆత్మనిర్భర్‌గా మారడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, “శక్తి వినియోగంలో ప్రధాన భాగం రవాణా రంగంలో ఉన్నందున, ఈ రంగంలో ఆవిష్కరణ, (పరిశోధన) ప్రయత్నాలకు మా ప్రాధాన్యత ఉండాలి. మేము దీన్ని సాధించగలమని నాకు నమ్మ...