Healthy Food | రోగనిరోధక శక్తి కోసం ఈ కూరగాయలు తప్పనిసరిగా తీసుకోండి..
Healthy Food : గత కొన్ని సంవత్సరాలుగా, పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా వ్యాధినిరోధక శక్తి లోపించి బలహీనంగా మారుతున్నరు. వాతావరణంలో స్వల్ప మార్పుతో కూడా వారు వైరల్, అంటు వ్యాధులకు గురవుతారు. నిజానికి, దీనికి కారణం వేగంగా మారుతున్న జీవనశైలి కారణంగా ప్రజలు జంక్ ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దాని వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్న ఆహారపదార్థాలు మన ప్లేట్‌లో నుంచి అదృశ్యమవుతున్నాయి. దీంతో వారు వ్యాధులబారిన పడుతున్నారు. అయితే ఈ రోజు మనం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉండే కొన్ని కూరగాయల గురించి తెలుసుకోబోతున్నాం.మన రోజువారీ ఆహారం నుంచి శరీరానికి అవసరమైనంత విటమిన్లు, పోషక ఖనిజాలు లభించకపోతే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీవవల్ల శరీరం అనేక వ్యాధుల బారిన పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విటమిన్లు, ఖనిజాల (విటమిన్లు, మినరల్స్ రిచ్ వెజిటేబుల్స్) లు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా...