
కేంద్ర మోటార్ వాహనాల నిబంధనల్లో భారీ మార్పులు: ఇథనాల్, హైడ్రోజన్, బయోడీజిల్‌కు ప్రాధాన్యం
న్యూఢిల్లీ: భారతదేశంలో పర్యావరణ అనుకూల ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మోటారు వాహన నిబంధనలు (Central Motor Vehicles Rules), 1989కి కీలక సవరణలు చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.30 రోజుల్లోగా సూచనలు, అభ్యంతరాలుఏప్రిల్ 27, 2026న జారీ చేసిన ఈ ముసాయిదాపై ప్రజలు, వాహన తయారీదారులు, ఇతర భాగస్వాములు తమ అభిప్రాయాలను 30 రోజుల్లోగా తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. అందిన సూచనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిబంధనలను ఖరారు చేస్తుంది.ఇథనాల్ విప్లవం: E20 నుండి E100 వరకు!పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే ప్రక్రియ (Ethanol Blending) దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తోంది. ప్రభుత్వం అందించిన గణాంకాల ప్రకారం.. ప్రతి ఏటా సుమారు 45 మిలియన్ బ్యారెళ...

