Electric bike | రూ. 1.19 లక్షలతో విడుదలైన GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్.. స్పెక్స్, ఫీచర్లు ఇవే..
GT Texa electric bike | జిటి ఫోర్స్ (GT Force) తాజాగా భారత్ లో కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. GT Texa అని పిలిచే ఈ బ్యాటరీతో నడిచే ఈ బైక్ ధర రూ. 1,19,555 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. గుర్గావ్ ఆధారిత EV తయారీ స్టార్టప్ ప్రారంభించిన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇదే కావడం విశేషం.
TEXA Electric Bike స్పెక్స్ & ఫీచర్లు
GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్ లో ఇన్సులేట్ చేయబడిన BLDC మోటార్ ను వినియోగించారు. ఇది గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఇందులో 3.5 kWh లిథియం-అయాన్ బ్యాటరీ నుంచి శక్తి పొందుతుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120-130 కిమీల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 4-5 గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఆటో -కట్‌తో ఆన్‌బోర్డ్ మైక్రో ఛార్జర్‌తో వస్తుంది. GT టెక్సా 180 కిలోల లోడ్ సామర్థ్యం, 18 డిగ్రీల గ్రేడబిలిటీని కలిగి ఉంది.TEXA Elec...