దేశవ్యాప్తంగా 10000 EV charging stations
2023 నాటికి EVRE, Park+ ఆధ్వర్యంలో ఏర్పాటుEV charging stations : ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారతదేశ వ్యాప్తంగా సుమారు 10వేలకు పైగా ఈవీ చార్జింగ్ EV charging stations ను ఏర్పాటు కానున్నాయి.
2023 చివరి నాటికి EVRE, Park+ సంస్థలు సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేస్తోంది. EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన EVRE అలాగే పార్కింగ్ సొల్యూషన్స్ బ్రాండ్ అయిన ర్కింగ్+ రెండేళ్లలో 10,000 EV ఛార్జింగ్ స్టేషన్లను భారతదేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాయి. ఇందు కోసం రెండు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. లాజిస్టిక్స్, వ్యక్తుల మొబిలిటీ విభాగాల కోసం స్మార్ట్ ఛార్జింగ్, పార్కింగ్ హబ్‌లను ఏర్పాటు చేయడానికి స్థలాలను సేకరించడంలో ఈ రెండు కంపెనీలు కలిసి పనిచేయనున్నాయి.EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాల రూపకల్పన, తయారీ, స్థాపన, నిర్వహణను EVRE చూసుకుంటుంది. చార్జింగ్ హబ్ రియల్ ఎస్టేట్...