వచ్చే ఏడాదిలో హోండా నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు
Honda EV Map -2024 ఇదే..
Honda electric scooters : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా (Honda) భారత మార్కెట్‌లో తన EV రోడ్‌మ్యాప్‌ను వెల్లడించింది. కంపెనీ వచ్చే ఏడాది దేశంలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనుంది. 2030 నాటికి ఒక మిలియన్ వార్షిక EV ఉత్పత్తిని చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) భారత మార్కెట్ కోసం తన EV రోడ్‌మ్యాప్‌ను వెల్లడించింది. EV రంగంలోకి ప్రవేశించిన చివరి మాస్-మార్కెట్ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో హోండా కంపెనీ కూడా ఒకటి. అయితే దీని వాహన శ్రేణిలో అత్యంత ప్రజాదరణ పొందిన యాక్టివా స్కూటర్ ( Activa scooter) ఎలక్ట్రిఫైడ్ వెర్షన్‌తో సహా రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల (electric scooters) ను వచ్చే ఏడాది హోండా భారత్‌లో విడుదల చేయనుంది. అంతేకాకుండా ఈ, జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 2030 నాటికి ఒక మిలియన్ వార్షిక E...