
Clean Energy Investments | ఇంధన రంగంలో ₹5.2 లక్షల కోట్ల పెట్టుబడులు – 2.6 లక్షల ఉద్యోగాల సృష్టి
ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగంలో భారీ పెట్టుబడి జడి వర్షం కురిసింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.5.2 లక్షల కోట్ల మేర పునరుత్పాదక శక్తి పెట్టుబడులకు హామీలు లభించాయని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి జి. రవికుమార్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 2.6 లక్షలకుపైగా కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నామని తెలిపారు.నవంబర్ 13–14 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన 30వ CII భాగస్వామ్య సదస్సులో ఈ ఒప్పందాలు కుదిరాయి. ఇవి గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక శక్తి, పంప్డ్ స్టోరేజ్, బయో ఇంధనాలు, రెన్యూవబుల్ ఎనర్జీ తయారీ యూనిట్లు, హైబ్రిడ్ ప్రాజెక్టులు వంటి విభాగాలను కవర్ చేస్తున్నాయి.ఒప్పందాల వివరాలునవంబర్ 13: ₹2.94 లక్షల కోట్ల పెట్టుబడులుఅంచనా ఉద్యోగాలు: 70,000+నవంబర్ 14: ₹2.2 లక్షల కోట్ల పెట్టుబడులుఅంచనా ఉద్యోగాలు: 2 లక్షలు+ReNew నుండి భారీ ఒప్పందాలుUKకు చెందిన గ్రీన్ ఎనర్జీ దిగ్గజం ReNew Energy Global ఏపీలో మ...

