
Jamuna Tudu : నా సోదరుడిని నరికే ముందు నన్ను నరుకు.. ‘లేడీ టార్జాన్’ స్ఫూర్తిదాయక గాథ!
మాఫియాను వణికించిన గిరిజన వీరనారి 'లేడీ టార్జాన్' స్ఫూర్తిదాయక గాథ!Lady Tarzan Jamuna Tudu Story | భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అయితే ఒక గిరిజన మహిళ తన గ్రామాన్ని మాత్రమే కాదు, వేలాది మందిని ప్రేరేపించి అడవులను కాపాడిన ఈమె కథ ఎంతో ప్రత్యేకమైనది.అడవిలో చెట్లను నరకడానికి గొడ్డలి పట్టుకొచ్చిన మాఫియాకు.. ఎదురుగా విల్లు, బాణాలు ధరించి ఒక వీరనారి నిలబడింది. "నా సోదరుడిని నరికే ముందు నన్ను నరుకు" అంటూ సింహంలా గర్జించింది. ఆమె పేరే జమునా టుడు (Jamuna Tudu) . జార్ఖండ్ అడవుల్లో కలప మాఫియాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈమెను ప్రపంచం గౌరవంగా 'లేడీ టార్జాన్' అని పిలుచుకుంటుంది.ఒడిశా కోడలిగా వచ్చి.. అడవి బిడ్డగా మారి..ఒడిశాలో పుట్టిన జమున, వివాహం తర్వాత జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లా 'ముతుర్ఖమ్' గ్రామానికి కోడలిగా వచ్చారు. అక్కడ పచ్చని సాల్ అడవిన...

