Mahindra : మహీంద్రా XUV.e8 ఎలక్ట్రిక్ కారు టెస్టింగ్ ఫొటోలు లీక్.. ఫీచర్లు ధరలు ఎలా ఉంటాయి..?
కొత్త మహీద్రా ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ 2024 చివరలో వచ్చే అవకాశం
భారత్ లో త్వరలో రానున్న ఆల్- ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌యూవీ700, Mahindra XUV.e8 లను ఇండియన్ ఆటో కార్ దిగ్గజం మహీంద్రా యాక్టివ్ గా
టెస్టింగ్ చేస్తూనే ఉంది. ఈ వెహికిల్స్ ఎన్నోసార్లు టెస్ట్ మ్యూల్ షీట్ తో కవర్ చేసి టెస్టింగ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ సమయాల్లో ఈ వాహనం
ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ కు సంబందించిన ఎన్నో కీలకమైన వివరాలు వెల్లడయ్యాయి. మొత్తానికి, ఇటీవల తాజాగా కనిపించిన స్పై ఫోటోలలో,
మోడల్ కీలక వివరాలు వెల్లడయ్యాయి.
Mahindra XUV.e8 Front Bumper
పైన కనిపిస్తున్న ఫోటో ప్రకారం, ఈ మోడల్ ఫ్రంట్ ప్రొఫైల్ పూర్తిగా డే టైం రన్నింగ్ ఎల్ఈడీ లైట్ బార్ తో వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే, ఈ
మోడల్ లుక్ టాటా హారియర్, సఫారీ ఫేస్ లిఫ్ట్స్ మాదిరిగానే ఉండనుంది. అప్పుడు, టెస్ట్ మ్యూల్ పాడ్ వంటి డిజైన్‌తో వర్టికల్ గా అమర్చబడిన స్ప్లిట్...