Maruti Electric car: మారుతి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే?
Maruti Electric car : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇటీవల కొత్త స్విఫ్ట్ తో సహా అనేక కొత్త మోడళ్లను భారతీయ రోడ్లపై పరీక్షిస్తోంది. ఈ క్రమంలో తొలి సారి మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ Maruti Electric Car భారతదేశంలో టెస్టింగ్ సమయంలో కెమెరాకు చిక్కింది. ఇంతకు ముందు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పోలండ్‌లో కూడా ప్రత్యక్షమైంది. టోక్యోలో జరిగిన 2023 జపాన్ మొబిలిటీ షో లో సుజుకి రెండు మోడళ్లను పరిచయం చేసింది. 2024లో స్విఫ్ట్, 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో మారుతి ఈవీఎక్స్ ఎస్యూవీ భారతదేశంలో లాంచ్ అవుతాయని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.కొన్ని నెలల క్రితం Maruti eVX టెస్ట్ మ్యూల్స్ మొదటిసారిగా కెమెరాల్లో చిక్కుకున్నాయి, విదేశీ గడ్డపై ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ఇప్పుడు, eVX ఎలక్ట్రిక్ SUV టెస్ట్ మ్యూల్ మొదటిసారిగా భారతీయ రోడ్లపై పరీక్షిస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ...