Saturday, December 7Lend a hand to save the Planet
Shadow

Tag: Maxwell Energy Systems)

సుర‌క్షిత‌మైన ఈవీల కోసం Hero Electric మ‌రో కీల‌క ఒప్పందం

సుర‌క్షిత‌మైన ఈవీల కోసం Hero Electric మ‌రో కీల‌క ఒప్పందం

EV Updates
భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ‌ల్లో ఒకటైన Hero Electric  (హీరో ఎలక్ట్రిక్ ),  దాని బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (BMS) కోసం ముంబైకి చెందిన మాక్స్‌వెల్ ఎనర్జీ సిస్టమ్స్ (Maxwell Energy Systems) )తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, Hero Electric తన ప‌టిష్ట స్థితిని కొనసాగించడానికి వేగవంతమైన వృద్ధి కోసం మాక్స్‌వెల్ కంపెనీ రాబోయే మూడు సంవత్సరాల్లో మిలియన్ యూనిట్లకు పైగా బీఎంఎస్‌ల‌ను సరఫరా చేస్తుంది.BMSని బ్యాటరీ ప్యాక్ యొక్క మెదడుగా కూడా భావిస్తారు. దీని ప‌రితీరుతోనే బ్యాట‌రీ జీవిత‌కాలం ఆధార‌ప‌డి ఉంటుంది. మాక్స్‌వెల్ కొత్తగా రూపొందించిన ఆటోమోటివ్-సేఫ్ BMS, హీరో ఎలక్ట్రిక్ యొక్క మొత్తం ఈ స్కూట‌ర్ల‌కు అందించ‌నుంది. ఇది ఇటీవల తప్పనిసరి చేసిన AIS156 సవరణలకు పూర్తిగా అనుగుణంగా రూపొందించబడింది.Hero Electric CEO సోహిందర్ గిల్ మాట్లాడుతూ...