MG Comet Electric Car: రోజుకు రూ.17 ఖర్చుతో 230 కి.మీ ప్రయాణం
ఆకర్షణీయమైన ఫీచర్లతో ఎంజీ ఎలక్ట్రిక్ కారు
ఎంజీ మోటార్స్ నుంచి తక్కువ ధరలో విడులైన రెండో ఎలక్ట్రిక్ కారు ఈ కామెట్. ఈ చిన్న ఎలక్ట్రిక్ కారుతో అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారును మీరు కేవలం రూ. 7.98 లక్షల ప్రారంభ ధరతోనే సొంతం చేసుకోవచ్చు. దీని రన్నింగ్ కాస్ట్ ఒక నెలకు పిజ్జా ధర కంటే తక్కువగా ఉంటుంది.
ఈ కారులో రెండు, నాలుగు సీట్లు ఉంటాయి. ఈ సంవత్సరమే ఎంజీ కంపెనీ ఈ కారును మార్కెట్ లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఇది పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒక్కో వేరియంట్లో పలు రకమైన ఫీచర్లు ఉన్నాయి. ఎంజీ కామెట్ ఫేస్ ధర రూ.7.98 లక్షలు, ఎంజీ కామెట్ ప్లే ధర రూ.9.28 లక్షలు, ఎంజీ కామెట్ ప్లష్ ధర రూ.9.98 లక్షలుగా ఉంది.ఈ కామెట్ కారులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం ఉంటుంది. వైర్ సెల్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేలను ఇది సపోర్ట్ ఇస్తుంది. స్టీరింగ్ వీల్ పై కంట్రోల్...