
Renewable Energy in 2024 : రికార్డు స్థాయిలో పునరుత్పాదక శక్తి
Renewable Energy in 2024 : మినిస్ట్రీ ఆఫ్ న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ (MNRE) డేటా ప్రకారం, భారతదేశం 2024లో రికార్డు స్థాయిలో 30 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించింది. 2023లో 13.75 GW పునరుత్పాదక విద్యుత్ ను పెంచుకోగా 2024లో 113% పెరిగింది. ఈ గణంకాలను బట్టి క్లీన్ ఎనర్జీ వైపు దేశం వేగవంతంగా పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 2030 నాటికి భారతదేశం 500 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పునరుత్పాదక శక్తి ని ప్రోత్సహిస్తూ కార్బన్ పాదముద్రను తగ్గించడం, స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో భారతదేశం వేగంగా అడుగులు వేస్తోంది.2024లో రెన్యూవబుల్ కెపాసిటీభారతదేశం 2024లో రికార్డు స్థాయిలో సుమారు 30 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించింది, 2023లో సాధించిన 13.75 GW సామర్థ్యంతో పోలిస్తే ఇది 113 శాంతం ఎక్కువ.కాగా భారతదేశంలో మొత్తం పునరుత్పా...