Solar Project | నంద్యాలలో 1200 MWh BESS & 50 MW హైబ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్లు
Nandyal Solar Project | పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో కీలక ముందడుగు పడింది. పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE) ఆధ్వర్యంలోని నవరత్న CPSU సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1200 MWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS), 50 MW హైబ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్ అభివృద్ధికి సంబంధించి పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్య సమ్మిట్ 2025లో ఎనర్జీ సెషన్ సందర్భంగా…
