Bharat Mobility Global Expo 2025 : EV అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరిగే అవకాశం
ఆటో రంగంలో పెట్టుబడులు పెట్టండి : పీఎం మోదీBharat Mobility Global Expo 2025 : ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం న్యూఢిల్లీలో అన్నారు, ఈ బూమ్ ప్రపంచ, దేశీయ తయారీదారులకు ఎన్నో అవకాశాలను సృష్టిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో రెండో ఎడిషన్‌ను మోదీ ప్రారంభించారు, ఈ ఏడాది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆటో రంగ ఎక్స్‌పో (Bharat Mobility Global Expo) . “మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్” వ్యూహాన్ని అనుసరించాలని ప్రధాని మోదీ పెట్టుబడిదారులను కోరారు.మొబిలిటీ రంగంలో వృద్ధి సాధించాలని కలలు కంటున్న పెట్టుబడిదారులకు భారతదేశం మంచి గమ్యస్థానమని, ప్రభుత్వం మీ వెంటే ఉందన్నారు. ఎక్స్‌పోలో ఆటోమొబైల్స్, కాంపోనెంట్ ఉత్పత్తులు, సాంకేతికతలకు...