
Farmer Kits | నేడు రైతులకు ‘ఫార్మర్ కిట్స్’ పంపిణీ
Farmer Kits Distribution Telangana : తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు ‘ఫార్మర్ కిట్స్’ అందజేయాలని నిర్ణయించింది. ఈ వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) మంగళవారం ఉదయం 10 గంటలకు సచివాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు.61,125 మంది రైతులకు లబ్ధిరాష్ట్రవ్యాప్తంగా ఉన్న 489 క్లస్టర్లలో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి క్లస్టర్ నుంచి 125 మంది రైతులను ఎంపిక చేయగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61,125 మంది రైతులకు ఈ కిట్లను అందజేయనున్నారు.కిట్ (Farmer Kits) లో ఏముంటాయి?ప్రకృతి వ్యవసాయంపై రైతులకు మరింత అవగాహన కల్పించడంతో పాటు వారిని ప్రోత్సహించేందుకు ఈ కిట్‌లో ఈ క్రింది వస్తువులను పొ...

