Harithamithra Telugu News

Home Agricultue వ్యవసాయ వార్తలు Farmer Kits | నేడు రైతులకు ‘ఫార్మర్ కిట్స్’ పంపిణీ

Farmer Kits | నేడు రైతులకు ‘ఫార్మర్ కిట్స్’ పంపిణీ

0
Tummala Nageswara Rao Rythu Nestham,

Farmer Kits Distribution Telangana : తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు ‘ఫార్మర్ కిట్స్’ అందజేయాలని నిర్ణయించింది. ఈ వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) మంగళవారం ఉదయం 10 గంటలకు సచివాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

61,125 మంది రైతులకు లబ్ధి

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 489 క్లస్టర్లలో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి క్లస్టర్‌ నుంచి 125 మంది రైతులను ఎంపిక చేయగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61,125 మంది రైతులకు ఈ కిట్లను అందజేయనున్నారు.

కిట్‌ (Farmer Kits) లో ఏముంటాయి?

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు మరింత అవగాహన కల్పించడంతో పాటు వారిని ప్రోత్సహించేందుకు ఈ కిట్‌లో ఈ క్రింది వస్తువులను పొందుపరిచారు:

  • గుర్తింపు కార్డు (ID Card)
  • క్షేత్ర దర్శిని డైరీ & చిన్న ప్యాకెట్ డైరీ
  • ప్రత్యేక క్యాలెండర్
  • క్లాత్ బ్యాగ్, టోపీ, పెన్ను

రైతు వేదికలలో పంపిణీ

సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ పంపిణీని ప్రారంభించిన వెంటనే, ఆయా జిల్లాల్లోని రైతు వేదికలలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రైతులకు ఈ కిట్లను అందజేస్తారని అధికారులు వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ఒక ఉద్యమంగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


Previous articlePaddy Procurement : రికార్డు స్థాయిలో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు.. మద్దతు ధర ఎంతంటే?
Next articleRythu Bharosa | 22న నర్మెట్టలో ‘రైతు భరోసా’ విడుదల!
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here