Pure EV ecoDryft సింగిల్ ఛార్జ్ పై 135km
Pure EV ecoDryft : హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ, ప్యూర్ ఈవీ (Pure EV ) ఇటీవలే తన సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ecoDryft విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది.ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 135 కిమీ ప్రయాణిస్తుంది. దీని ధరల వివరాలు జనవరి 2023 మొదటి వారంలో ప్రకటించనుది.ఈ బైక్ కోసం టెస్ట్ రైడ్‌లు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ecoDryft డిజైన్, రంగులు డిజైన్ పరంగా, ఇది సాధారణ మోటార్‌సైకిల్‌గా కనిపిస్తుంది. ఇది కార్ప్ హెడ్‌ల్యాంప్, ఫైవ్-స్పోక్ అల్లాయ్ వీల్స్, సింగిల్-పీస్ సీటు కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ నాలుగు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. అవి నలుపు, బూడిద, నీలం మరియు ఎరుపు.
ప్యూర్ ఈవీ ఏకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ AIS 156 సర్టిఫికేట్ పొందిన 3.0 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 135 కి.మీల రైడిం...