Electric cycle offer | ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పై రూ.3000 డిస్కౌంట్..
Electric cycle offer | అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని Nexzu Mobility కంపెనీ మహిళా కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ మార్చి 8 నుండి మార్చి 17 వరకు (10 రోజులు) కొనసాగుతుంది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు Rompus Plus, Bazinga EV సైకిళ్లపై మూడు వేల తగ్గింపు పొందవచ్చు.గతంలో రూ.32,750గా ఉన్న రోంపస్ ప్లస్ ఇప్పుడు రూ.29,750 తగ్గింపు ధరతో అందుబాటులోకి వచ్చింది. రోంపస్ ప్లస్ రోజువారీ ప్రయాణాల కోసం రూపొందించబడింది. 5.2Ah Li-ion బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సింగిల్ ఛార్జింగ్ పై 32 కిమీ రేంజ్ ఇస్తుంది. ఇది గంటకు 25 కిమీ/గం గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.ఇక మరో మోడల్ Nexzu Bazinga EV సైకిల్ మునుపటి ధర రూ. 44,500 గా ఉండగా, ఇప్పుడు ప్రత్యేక ఆఫర్ కింద రూ. 41,500 కి అందుబాటులో ఉంది. Bazinga లోల్ డిటాచబుల్ Li-ion బ్యాటరీపై సింగిల్ చార్జిపై 100km వరకు ప్ర...