Watch | ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవ్ ఎలక్ట్రిక్ స్కూటర్
Ola Solo Electric Scooter | ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవ్ స్కూటర్ తీసుకొస్తోంది. Ola Solo అని పిలవబడే ఈ స్కూటర్ వివరాలు కంపెనీ యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వెల్లడయ్యాయి. ఓలా సహ-వ్యవస్థాపకుడు, CEO, భవిష్ అగర్వాల్ కూడా తన X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో సెల్ఫ్-రైడ్ స్కూటర్ వీడియోను షేర్ చేశారు. ఏప్రిల్ 1న మొదటిసారిగా టీజ్‌చేసిన ఓలా సోలో ముందుగా ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా సోషల్ మీడియా ప్రాంక్ వీడియోగా అందరూ భావించారు. అయితే ఇది నిజమైన నమూనా అని తేలింది. ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ తన X హ్యాండిల్‌పై అప్‌లోడ్ చేసిన వీడియోలో, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రైడర్ ఆన్‌బోర్డ్ లేకుండా స్కూటర్ నడుస్తున్నట్లు చూడవచ్చు.
సెల్ఫ్ రైడింగ్ టెక్నాలజీతో..
అగర్వాల్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో.. సోలో " ఓలా ఇంజనీరింగ్ బృందాలు భవిష్యత్తులో రానున్న ద్విచక్ర వాహనాలలో సెల్ఫ్ డ్రైవ...